David Miller: డేవిడ్ మిల్లర్‌తో జాగ్రత్త.. టీ20ల్లో భారత్‌పై మిల్లర్‌కు మెరుగైన రికార్డు!
సౌత్ ఆఫ్రికా మిడిలార్డర్ ఆటగాడు డేవిడ్ మిల్లర్(David Miller) ఒంటిచేత్తో మ్యాచ్ స్వరూపాన్ని మార్చగలడు. తనదైన రోజున భారీ షాట్లతో రెచ్చిపోయి దక్షిణాఫ్రికాను విజయతీరాలకు చేర్చుతాడు. ఇప్పటికే ఎన్నో కీలకమైన ఇన్నింగ్స్ లు ఆడి సౌతాఫ్రికాకు మరుపురాని విజయాలను అందించాడు. సౌతాఫ్రికాతో టీమిండియా ఈనెల 10 నుంచి 3 టీ20 మ్యాచులను ఆడనుంది. దక్షిణాఫ్రికా ప్రమాదకర బ్యాటర్లలో మిల్లర్ ఒకరు. అతనికి టీ20ల్లో భారత్ పై మెరుగైన రికార్డును ఉంది. భారత్ పై 15 ఇన్నింగ్స్ లు ఆడిన మిల్లర్ 379 పరుగులు చేశాడు. ఇందులో రెండు హాఫ్ సెంచరీలు, ఒక సెంచరీ ఉంది. అతని సగటు 47.37 ఉండడం గమనార్హం.
డేవిడ్ మిల్లర్ సాధించిన రికార్డులివే
అయితే ఇండియాలో జరిగిన టీ20ల్లో మిల్లర్ పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. టీ20ల్లో వరుసగా 10, 9, 5, 24 పరుగులు చేసి నిరాశపరిచాడు. మిల్లర్ ఇప్పటి వరకు స్వదేశంలో 47 టీ20లను ఆడాడు. ఈ మ్యాచుల్లో 33.09 సగటుతో 1,026 రన్స్ చేశాడు. పది సంవత్సరాల క్రితం టీ20ల్లో అరంగేట్రం చేసిన మిల్లర్ ఇప్పటివరకూ 114 మ్యాచులను ఆడాడు. ఈ మ్యాచుల్లో 144.64 స్ట్రైక్ రేట్‌తో 2,216 రన్స్ చేశాడు. ఇందులో అరు హాఫ్ సెంచరీలు, రెండు సెంచరీలున్నాయి.