DC Vs PBKS : ఢిల్లీపై పంజాబ్ గెలుపు.. పంజాబ్ ప్లేఆఫ్ ఆశలు సజీవం
ఈ వార్తాకథనం ఏంటి
తప్పక గెలవాల్సిన మ్యాచులో ఢిల్లీ క్యాపిటల్స్ పై పంజాబ్ విజయం సాధించింది. అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో పంజాబ్ మొదట 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది.
పంజాబ్ బ్యాటర్ ప్రభ్ సిమ్రాన్ సింగ్ దూకుడుగా ఆడి సెంచరీ చేయడంతో పంజాబ్ గౌరవప్రదమైన స్కోరును చేసింది.
ప్రభ్ సిమ్రాన్ 65 బంతుల్లో 10 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 103 పరుగులు చేశాడు. దీంతో ఐపీఎల్ లో మొదటి సెంచరీని తన ఖాతాలో వేసుకున్నాడు.
కెప్టెన్ ధావన్(7),లివింగ్ స్టోన్(4), జితేష్ శర్మ(5), హర్ ప్రీత్ బ్రార్(2), షారుఖ్ ఖాన్ (2) తో పూర్తిగా నిరాశపరిచారు.
ఢిల్లీ బౌలర్లలో ఇషాంత్ శర్మ రెండు వికెట్లతో మెరిశాడు.
Details
విజృంభించిన పంజాబ్ స్పిన్నర్లు
లక్ష్య చేధనకు దిగిన ఢిల్లీకి మంచి ఆరంభం లభించింది. మొదట్లో కెప్టెన్ డేవిడ్ వార్నర్ పంజాబ్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. 27 బంతుల్లో 10 ఫోర్లు, 1 సిక్సర్ సాయంతో 54 పరుగులు చేశాడు.
దీంతో 6 ఓవర్లకు వికెట్ నష్టపోకుండా 63 పరుగులు చేసిన ఢిల్లీ తర్వాత వెంట వెంటనే వికెట్లను కోల్పోయింది. హర్ ప్రీత్ బ్రార్ నాలుగు కీలక వికెట్లు పడగొట్టి ఢిల్లీ గెలుపు ఆశలకు బ్రేక్ లు వేశాడు.
మిచిల్ మార్ష్(3), రుసో(5), అక్షర్ పటేల్(1), మనీష్ పాండే(0) తో పూర్తిగా విఫలమయ్యారు.
ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 136 పరుగులే చేయగలింది. దీంతో పంజాబ్ 31 పరుగుల తేడాతో విజయం సాధించింది.