
Shoaib Akhtar: విండీస్ చేతిలో ఓటమి.. పాక్ ఆటగాళ్లపై మాజీ పేసర్ తీవ్ర విమర్శలు
ఈ వార్తాకథనం ఏంటి
వెస్టిండీస్ చేతిలో ఘోర పరాభవం పాలైన పాకిస్థాన్ జట్టుపై మాజీ క్రికెటర్ల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. కీలకమైన మూడో వన్డేలో పాక్ 200 పరుగులకుపైగా తేడాతో ఓడిపోవడం, కేవలం 92 పరుగులకే ఆలౌటవడం చర్చనీయాంశమైంది. కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ డకౌట్ అవ్వగా, బాబార్ అజామ్ కేవలం 9 పరుగులకే వెనుదిరిగాడు. ఈ ప్రదర్శనపై మాజీ స్టార్ పేసర్ సోయబ్ ఆక్తర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మా కాలంలో మేమంతా ఒకే జట్టుగా కట్టుబడి ఆడేవాళ్లం. టాలెంట్‌ను ప్రదర్శించేందుకు ఎప్పుడూ ప్రయత్నించేవాళ్లం. ఒక్కరి మీద మాత్రమే ఆధారపడకుండా, ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకునేవాళ్లు. ఎవరూ తప్పించుకునే మార్గాలు వెతికేవారు కాదు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారింది.
Details
వన్డే సిరీస్ ను కోల్పోయిన పాక్
10-15 ఏళ్లుగా ఆటగాళ్లు తమ స్వలాభం కోసం మాత్రమే ఆడుతున్నారు. సొంత సగటును మెరుగుపరచుకోవడమే వారి లక్ష్యం. దేశం కోసం మ్యాచ్ గెలవాలనే తపన చూపాలి. ఇప్పటికైనా మార్పు రావాలి. జట్టులో ఆ వాతావరణం కల్పించాలి. పరిస్థితులకు తగినట్లుగా ఆధునిక క్రికెట్ ఆడాలి. దీనిని అర్థం చేసుకోవడం అంత కష్టమా? విండీస్ బౌలింగ్ ముందు పాక్ బ్యాటింగ్ పూర్తిగా పేలవంగా ఉంది. బంతి బాగా మూవ్ అవుతున్నప్పుడు జాగ్రత్తగా ఆడాలి. ఇది రావల్పిండి పిచ్ కాదు. ప్రతిచోటా ఆ పిచ్‌ను తీసుకెళ్లలేమని ఆయన వ్యాఖ్యానించారు. అంతకుముందు టీ20 సిరీస్‌ను పాక్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇక వన్డే సిరీస్‌ను మాత్రం 2-1 తేడాతో ఆ జట్టు కోల్పోయింది.