Page Loader
అతి కష్టం మీద ఐపీఎల్ లో బోణీ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్
చివర్లో రాణించిన అక్షర్ పటేల్

అతి కష్టం మీద ఐపీఎల్ లో బోణీ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 21, 2023
10:02 am

ఈ వార్తాకథనం ఏంటి

ఐపీఎల్ 2023 సీజన్ లో ఢిల్లీ క్యాపిటల్స్ తమ వరుస పరాజయాలకు ఎట్టకేలకు చెక్ పెట్టింది. వరుసగా ఐదు ఓటముల తర్వాత ఈ సీజన్లో అతి కష్టం మీద కోల్ కతా పై విజయం సాధించింది. బౌలింగ్ లో కుల్దీప్, అన్రిచ్ నోర్జ్, అక్షర పటేల్ సత్తాచాటగా.. బ్యాటింగ్ లో వార్నర్ హాఫ్ సెంచరీతో రాణించడంతో ఢిల్లీ నాలుగు వికెట్ల తేడాతో గెలుపొందింది. కోల్ కతా 20 ఓవర్లలో 127 పరుగులు చేసింది. సింపుల్ టార్గెట్ ను చేధించడంలో ఢిల్లీ చివరివరకూ పోరాడాల్సి వచ్చింది. ఒకానొక దశలో కోల్ కతా వికెట్ కీపర్ లిటన్ దాస్ రెండు స్టంప్స్ మిస్ చేయడం, ఫీల్డర్లు కొన్ని క్యాచ్ లను విడిచిపెట్టడంతో ఢిల్లీకి అదృష్టం కలిసొచ్చింది.

Details

ఐపీఎల్ లో చెత్త మ్యాచ్ అంటూ ట్రోల్స్

కోల్ కతా స్పిన్నర్లు వరుణ్ చక్రవర్తి, అంకుల్ రాయ్, నితీన్ రాణా తలో రెండు వికెట్లు తీసి ఢిల్లీ బ్యాటర్లను భయపెట్టారు. అంతకుముందు కోల్ కతా బ్యాటర్లలో జేసన్ రాయ్ 43, రసెసల్ 38 రన్స్ మినహా మిగతా బ్యాటర్లు సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితమయ్యారు. ఢిల్లీ బౌలర్లు ఇషాంత్ శర్మ, నోర్జ్, అక్షర పటేల్, కుల్దీప్ యాదవ్ తలో రెండు వికెట్లతో రాణించారు. ఢిల్లీ బ్యాటర్లు నెమ్మదిగా ఇన్నింగ్స్ ను కొనసాగించడంతో మ్యాచ్ బోరింగ్ గా మారింది. ఈ మ్యాచ్ లో ఓ సిక్సర్ కూడా నమోదు కాకపోవడం గమనార్హం. ఐపీఎల్ లోనే ఇది చెత్త మ్యాచ్ అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.