PBKS vs DC: పంజాబ్ కింగ్స్‌కు 175 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించిన ఢిల్లీ క్యాపిటల్స్
ఐపీఎల్-2024లో భాగంగా పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ భారీ స్కోర్ చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్ కి చేసిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 174 పరుగులు చేసింది. బ్యాటింగ్ లో హోప్ -33, పోరెల్ -32, వార్నర్-29,అక్షర్ పటేల్ - 21,మార్ష్ - 20 పరుగులు చేశారు. పంజాబ్ బౌలర్లలో హర్హల్ పటేల్ 2,అర్షదీప్ సింగ్ 2,రబడా,బ్రార్,చాహర్ ఒక్కో వికెట్ తీశారు. ఒకానొక సమయంలో ఢిల్లీ బ్యాటింగ్ లో తడబడింది. స్వల్ప స్కోరు చేస్తుందనే అనుకున్నప్పటికీ.. ఇంపాక్ట్ ప్లేయర్ కింద బరిలోకి దిగిన అభిషేక్ పోరల్ పంజాబ్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. దీంతో ఢిల్లీ స్కోరు పరుగులు తీసింది.