
WPL: ఉత్కంఠ పోరులో ఢిల్లీ క్యాపిటల్స్ విజయం.. యూపీ వారియర్స్ ఓటమి
ఈ వార్తాకథనం ఏంటి
వడోదరలోని కోటంబీ స్టేడియంలో బుధవారం జరిగిన మహిళల ప్రీమియర్ లీగ్ సీజన్ 3లో భాగంగా యూపీ వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ 7 వికెట్ల తేడాతో విజయాన్ని నమోదు చేసింది.
టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ మొదట బౌలింగ్ ఎంచుకుంది.
యూపీ వారియర్స్ ఓపెనర్లు కిరణ్ నవ్‌గిరే (51), వ్రిందా దినేశ్ (16) దూకుడుగా ఆడుతూ 5.5 ఓవర్లలోనే 66 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
ఈ జోడీ ప్రమాదకరంగా మారుతుండగా, అన్నాబెల్ సూథర్‌లాండ్ వ్రిందా దినేశ్ (16)ను జెమీమా రోడ్రిగ్స్‌కు క్యాచ్ ఇవ్వించేలా చేసి విడగొట్టింది. అనంతరం కిరణ్ నవ్‌గిరే (51) కూడా పెవిలియన్ చేరింది.
Details
ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన దిల్లీ
దీప్తి శర్మ (7), తహీలా మెక్‌గ్రాత్ (1) తక్కువ స్కోరుకే అవుట్ కాగా, శ్వేతా షరావత్ (37), సోఫీ ఎక్లెస్టోన్ (33) చివర్లో మెరుగైన బ్యాటింగ్ ప్రదర్శనతో జట్టును గౌరవప్రదమైన స్కోరుకు చేర్చారు.
20 ఓవర్లలో యూపీ వారియర్స్ 7 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది.
అన్నాబెల్ సూథర్‌ల్యాండ్ 2 వికెట్లు తీసుకోగా, మారిఝానే కాప్, జోనాస్సెన్, అరుంధతీ రెడ్డి, మిన్నూ మణి తలా ఒక వికెట్ తీసుకున్నారు.
167 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడింది.
ఓపెనర్లు షెఫాలీ వర్మ (26), మెగ్ లాన్నింగ్ (69) చక్కటి ఆరంభాన్ని ఇచ్చి తొలి వికెట్‌కు 65 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
Details
మెగ్ లాన్నింగ్ అద్భుత హాఫ్ సెంచరీ
షెఫాలీ వర్మ (26), జెమీమా రోడ్రిగ్స్ (0) తక్కువ వ్యవధిలోనే పెవిలియన్ చేరడంతో ఢిల్లీ కాస్త కష్టాల్లో పడింది.
మెగ్ లాన్నింగ్ అర్ధ శతకం పూర్తి చేసుకున్న తర్వాత 69 పరుగులతో అవుట్ కావడంతో మ్యాచ్ కఠినంగా మారే సూచనలు కనిపించాయి.
అయితే, అన్నాబెల్ సూథర్‌ల్యాండ్(41*), మారిఝానే కాప్ (29*) మెరుపు బ్యాటింగ్‌తో ఆఖరి ఓవర్ 5వ బంతికి విజయాన్ని అందించారు.
19.5 ఓవర్లలో కేవలం 3 వికెట్లు కోల్పోయి ఢిల్లీ క్యాపిటల్స్ 167 పరుగులు చేసి 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
సోఫీ ఎక్లెస్టోన్, దీప్తి శర్మ, గ్రేస్ హ్యారిస్ తలా ఒక వికెట్ తీసుకున్నారు. ఈ విజయంతో ఢిల్లీ క్యాపిటల్స్ సీజన్‌లో తమ అద్భుత ప్రదర్శనను కొనసాగించింది.