Loading...
Delhi Capitals: అక్షర్, అశుతోష్ విషయంలో దిల్లీ కీలక నిర్ణయం.. ట్రేడ్‌కు నో!
అక్షర్, అశుతోష్ విషయంలో దిల్లీ కీలక నిర్ణయం.. ట్రేడ్‌కు నో!

Delhi Capitals: అక్షర్, అశుతోష్ విషయంలో దిల్లీ కీలక నిర్ణయం.. ట్రేడ్‌కు నో!

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 10, 2026
04:01 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఐపీఎల్ 2027 సీజన్‌కు సంబంధించి ఆటగాళ్ల ట్రేడింగ్‌పై ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. డిసెంబరు 16న గోవాలో మినీ వేలం జరగనుండగా.. నవంబర్ 17లోపు రిటైన్, రిలీజ్ చేసే ఆటగాళ్ల జాబితాలను ఫ్రాంఛైజీలు బీసీసీఐకి సమర్పించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఆయా జట్లు ఆటగాళ్లను ట్రేడ్ చేసుకుంటున్నాయి. తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్ కీలక అప్‌డేట్ ఇచ్చింది.

వివరాలు

అక్షర్, అశుతోష్ ట్రేడ్‌పై క్లారిటీ

టీమిండియా ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్, యువ ఆటగాడు అశుతోష్ శర్మలను ట్రేడ్ చేసే ఆలోచన తమకు లేదని దిల్లీ క్యాపిటల్స్ స్పష్టం చేసింది.

వీరిద్దరూ వచ్చే సీజన్‌లోనూ దిల్లీ ఫ్రాంఛైజీ తరఫునే కొనసాగనున్నారు. అంతేకాదు.. తమ ట్రేడింగ్ విండోను కూడా మూసివేసినట్లు ఫ్రాంఛైజీ వర్గాలు వెల్లడించాయి.

రిటెన్షన్ గడువుకు ముందు ఇతర ఆటగాళ్లను ట్రేడ్ చేసుకునే ప్రణాళికలు కూడా లేవని తెలిపాయి.

గత కొంతకాలంగా అక్షర్ పటేల్ కోసం చెన్నై సూపర్ కింగ్స్ ఆసక్తి చూపుతోందని, అశుతోష్ శర్మను ఇతర ఫ్రాంఛైజీలు తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నాయని వార్తలొచ్చాయి.

వీరిద్దరి ట్రేడ్ ఖాయమనే ప్రచారం కూడా జరిగింది. అయితే, తాజాగా దిల్లీ క్యాపిటల్స్ ఇచ్చిన ప్రకటనతో ఈ ఊహాగానాలకు తెరపడింది.

వివరాలు

దిల్లీ కెప్టెన్‌గా ఎవరు?

గత సీజన్‌లో అక్షర్ పటేల్ దిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా వ్యవహరించాడు.

అయితే ఈసారి లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ నుంచి ట్రేడ్ ద్వారా రిషభ్ పంత్ తిరిగి దిల్లీ జట్టులో చేరాడు. మరోవైపు కేఎల్ రాహుల్ కూడా కెప్టెన్సీ రేసులో ఉన్నాడు.

ఈ నేపథ్యంలో ఐపీఎల్ 2027 సీజన్‌కు జట్టు సారథ్య బాధ్యతలను ఎవరికి అప్పగించాలనే అంశంపై ఫ్రాంఛైజీ ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు.

ADVERTISEMENT