Venkatesh Iyer: వేలానికి ముందే విధ్వంసం.. ఆకాశమే హద్దుగా చెలరేగిన వెంకటేష్ అయ్యర్!
ఈ వార్తాకథనం ఏంటి
టీమిండియా స్టార్ ఆటగాడు వెంకటేష్ అయ్యర్ సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో అదరగొడుతున్నాడు. మధ్యప్రదేశ్ తరఫున బరిలోకి దిగిన అతడు పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో అద్భుతంగా రాణించాడు. ఓపెనర్‌గా ఇన్నింగ్స్ ప్రారంభించిన వెంకటేష్ అయ్యర్ 43 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 70 పరుగులు చేసి జట్టుకు భారీ ఆరంభం అందించాడు. అతడికి అనికేత్ వర్మ (31 పరుగులు; 16 బంతుల్లో 3 సిక్సర్లు), మంగేష్ యాదవ్ (28 పరుగులు; 12 బంతుల్లో 4 ఫోర్లు, ఒక సిక్స్) మంచి సహకారం అందించారు. వీరి దూకుడైన ఆటతో తొలుత బ్యాటింగ్ చేసిన మధ్యప్రదేశ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి భారీగా 225 పరుగులు చేసింది.
Details
కేకేఆర్ వదిలేసింది
పంజాబ్ బౌలర్లలో గుర్నూర్ బ్రార్ మూడు వికెట్లు పడగొట్టగా, రమన్‌దీప్ సింగ్ రెండు వికెట్లు సాధించాడు. జస్సిందర్ సింగ్, రఘు శర్మ చెరో వికెట్ తీసుకున్నారు. ఐపీఎల్ 2025 వేలంలో కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు వెంకటేష్ అయ్యర్‌ను రూ.23.75 కోట్ల భారీ మొత్తానికి సొంతం చేసుకుంది. అయితే ఐపీఎల్ 2025 సీజన్‌లో అతడు తీవ్రంగా నిరాశపరిచాడు. మొత్తం 142 పరుగులు మాత్రమే చేయగలిగాడు, సగటు 21గా నమోదైంది. ఈ కారణంగా సీజన్ చివరికి అతడికి తుది జట్టులో కూడా స్థానం దక్కలేదు. దీంతో ఐపీఎల్ 2026 వేలానికి ముందు కేకేఆర్ అతడిని విడుదల చేసింది.
Details
వెంకటేష్ అయ్యర్ కోసం పోటీపడనున్న ఫ్రాంచేజీలు
అయినప్పటికీ, కేకేఆర్‌తో తనకు ఇంకా టచ్‌లోనే ఉన్నానని వెంకటేష్ అయ్యర్ ఒక సందర్భంలో వెల్లడించాడు. మరోవైపు, కేకేఆర్ అతడిని తక్కువ మొత్తానికి మళ్లీ దక్కించుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇక వేలం రోజున విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడగల సామర్థ్యం, ఆల్‌రౌండర్ నైపుణ్యం ఉండటంతో వెంకటేష్ అయ్యర్ కోసం ఇతర ఫ్రాంచైజీలు కూడా పోటీ పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.