Page Loader
ఐపీఎల్‌లో ట్రోఫీలు సాధించిన జట్ల వివరాలు
2023 ఐపీఎల్ మొదటి మ్యాచ్‌లో తలపడనున్న గుజరాత్, చైన్నై

ఐపీఎల్‌లో ట్రోఫీలు సాధించిన జట్ల వివరాలు

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 30, 2023
09:47 pm

ఈ వార్తాకథనం ఏంటి

2008 ధనాధన్ లీగ్ ఐపీఎల్ సీజన్ మొదలై.. అభిమానులు ఎంతగానో అకట్టుకుంది. ప్రస్తుతం విజయవంతంగా 16వ సీజన్ లోకి ఐపీఎల్ అడుగుపెడుతోంది. మార్చి 31న చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య మొదటి మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఏ ఏ జట్లు ఇంతవరకు ఐపీఎల్ టైటిల్ సాధించాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 2008లో మొదటి ఐపీఎల్ ట్రోఫీని రాజస్థాన్ రాయల్స్ కైవసం చేసుకుంది. అప్పట్లో సీఎస్కే ను ఫైనల్ లో రాజస్థాన్ ఓడించి సత్తా చాటింది. అప్పట్లో ఆల్ రౌండర్ ప్రదర్శనతో ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ గా షేన్ వార్నర్ నిలిచిన విషయం తెలిసిందే.

ఐపీఎల్

2008 ఐపీఎల్ టైటిల్ గెలిచిన డెక్కన్ ఛార్జర్స్

2008లో పేలవ ప్రదర్శనతో నిరాశ పరిచిన డెక్కన్ ఛార్జర్స్.. 2009లో కెప్టెన్ గిల్ క్రిస్ట్ సారథ్యంలో ఫైనల్ లో బెంగళూరుపై.. డెక్కన్ ఛార్జర్స్ ఆరు పరుగుల తేడాతో గెలిచి, ఐపీఎల్ ట్రోఫిని గెలుచుకుంది. ఈ సీజన్లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ గా గిల్‌క్రిస్ట్ నిలిచాడు. ఎంఎస్ ధోని నాయకత్వంలో సీఎస్కే వరుసగా 2010-11లో ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకొని రికార్డులను బద్దలు కొట్టింది. 2012లో మళ్లీ ఫైనల్ కు చేరిన సీఎస్కే వరుసగా మూడో టైటిల్ పై కన్నేసింది. అయితే ఫైనల్‌లో సీఎస్కే ను కేకేఆర్ ఓడించి టైటిల్‌ను ఎగరేసుకొనిపోయింది. కెప్టెన్ గౌతమ్ గంభీర్ 590 పరుగులతో కేకేఆర్ జట్టును ముందుండి నడిపించాడు.

ఐపీఎల్

2013లో మొదటి టైటిల్‌ను అందుకున్న ముంబై

2010-2012లో ప్లే ఆఫ్‌కు చేరుకున్న ముంబై.. 2013లో మొదటిసారిగా రోహిత్ శర్మ సారథ్యంలో కప్పును గెలుచుకుంది. 2014లో కెప్టెన్ గంభీర్ మళ్లీ కేకేఆర్‌కి టైటిల్‌ను అందించాడు. ఈ సీజన్లో ఫైనల్ మ్యాచ్‌తో సహా కేకేఆర్ వరుసగా తొమ్మిది విజయాలు సాధించి రికార్డు సృష్టించింది. రాబిన్ ఉతప్ప 600 పరుగులు, సునీల్ నరైన్ 21 వికెట్లతో విజృంభించారు 2015 ఫైనల్‌లో మళ్లీ సీఎస్కే, ముంబై తలపడ్డాయి. ఫైనల్‌లో రోహిత్ 50 పరుగులు చేసి ముంబైని గెలిపించాడు. ఈ టోర్నిలో రోహిత్ శర్మ 482 పరుగులతో రాణించాడు 2016లో వార్నర్ సారథ్యంలో తొలిసారిగా సన్ రైజర్స్ జట్టు టైటిల్ గెలుచుకుంది. ఈ సీజన్లో కెప్టెన్ డేవిడ్ వార్నర్ అత్యధికంగా 848 పరుగులు చేసి సత్తా చాటాడు.

ఐపీఎల్

2022లో ఐపీఎల్ టైటిల్‌ను గెలుచుకున్న గుజరాత్ జెయింట్స్

2017 సీజన్‌లో రోహిత్‌శర్మ సారథ్యంలో మళ్లీ ముంబై ఇండియన్స్ పుంజుకుంది. ఈ సీజన్లో 10 మ్యాచ్‌లు గెలిచిన ముంబై ఇండియన్స్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. ఫైనల్‌లో పుణే‌పై ముంబై ఒక్క పరుగు తేడాతో గెలిచి సంచలన విజయం అందుకుంది. 2018లో మళ్లీ అరంగేట్రం చేసిన సీఎస్కే.. ఫైనల్‌లో ఎస్ఆర్‌హెచ్ ను ఓడించి మరోసారి కప్పును కైవసం చేసుకుంది. 2019-20లో ముంబై ఇండియన్స్ బ్యాక్ టు బ్యాక్ కప్పు సాధించిన జట్టుగా నిలిచింది. 2021 సీఎస్కే కప్పు సాధించి.. వరుసగా నాలుగు ఐపీఎల్ టైటిల్ సాధించిన జట్టుగా నిలిచింది. 2022 ఐపీఎల్‌లో అరంగేట్రం చేసిన గుజరాత్ జెయింట్స్ మొదటిసారి కప్పును ఎగరేసుకొనిపోయింది. ఫైనల్‌లో రాజస్థాన్ ను ,ఓడించి గుజరాత్ జెయింట్స్ సత్తా చాటింది.