IPL 2023: పక్కా వ్యూహంతో బరిలోకి దిగుతున్న కోల్‌కతా నైట్ రైడర్స్
మరికొద్ది గంటల్లో ధనాధన్ లీగ్ ఐపీఎల్ 2023 ప్రారంభం కానుంది. కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు ఈసారీ పక్కా వ్యూహంతో బరిలోకి దిగుతున్నట్లు తెలుస్తోంది. టోర్ని ప్రారంభానికి ముందే కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దూరం కానున్నట్లు తెలుస్తోంది. బంగ్లాదేశ్, ఐర్లాండ్ సిరీస్ కారణంగా మొదటి కొన్ని మ్యాచ్‌లకు లిట్టన్‌దాస్, షకీబ్ అల్‌హసన్ దూరమయ్యే అవకాశాలు కనిపిస్తాయి. యువ ఆటగాళ్లతో ఐపీఎల్ టైటిల్ సొంతం చేసేందుకు కేకేఆర్ ప్లాన్ చేసింది. మిని వేలంలో జగదీశన్‌ను రూ.90 లక్షలు, ఆల్‌రౌండర్లు డేవిడ్ వైస్ రూ. 1కోటి, షకీబ్ అల్ హసన్‌ను రూ.1.5 కోట్లలకు కేకేఆర్ కొనుగోలు చేసింది. గుజరాత్ టైటాన్స్ నుండి లాకీ ఫెర్గూసన్, ఢిల్లీ క్యాపిటల్స్ నుండి శార్దూల్ ఠాకూర్‌లను కేకేఆర్ దక్కించుకుంది.
కేకేఆర్ జట్టులోని సభ్యులు
కేకేఆర్ వరుసగా 2012, 2014లో గౌతం గంభీర్ సారథ్యంలో రెండుసార్లు ఐపీఎల్ ట్రోఫిని గెలుచుకుంది. 2011, 2016, 2017, 2018లో నాలుగుసార్లు ప్లేఆఫ్‌లకు చేరుకుంది. ఎనిమిది సార్లు లీగ్ దశలోనే కేకేఆర్ నిష్ర్కమించింది. KKR జట్టు: శ్రేయాస్ అయ్యర్ (సి), నితీష్ రాణా, రహ్మానుల్లా గుర్బాజ్, వెంకటేష్ అయ్యర్, ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, శార్దూల్ ఠాకూర్, లాకీ ఫెర్గూసన్, ఉమేష్ యాదవ్, టిమ్ సౌథీ, హర్షిత్ సింగ్ రాణా, వరుణ్ చక్రవర్తి, ఆర్. , ఎన్. జగదీసన్, వైభవ్ అరోరా, సుయాష్ శర్మ, డేవిడ్ వైస్, కుల్వంత్ ఖేజ్రోలియా, లిట్టన్ దాస్, మన్‌దీప్ సింగ్, షకీబ్ అల్ హసన్.
బౌలింగ్ పటిష్టంగా ఉన్న కేకేఆర్
బ్యాటింగ్ పరంగా నితీష్ రాణా రాణించనున్నాడు. ఒకవేళ అతను విఫలమైతే అండ్రూ రస్సెల్, షకీబ్ అల్ హసన్ మ్యాచ్ ను మలుపు తిప్పడానికి సిద్ధమయ్యారు. సునీల్ నరైన్, శార్దూల్ ఠాకూర్ జట్టుకు అదనపు బలమని చెప్పొచ్చు. బౌలింగ్ విషయానికి వస్తే.. సునీల్ నరైన్ పేరును ప్రత్యేకంగా చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇటీవల వన్డే క్రికెట్లో ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా ఏడు వికెట్లను పడగొట్టాడు. ఇంకా ఉమేష్ యాదవ్ ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో మూడు వికెట్లు తీసి మంచి ఫామ్‌లో ఉన్నాడు. స్పిన్ విభాగంలో వరుణ్ చక్రవర్తి సంచలనాలను సృష్టించడానికి సిద్ధంగా ఉన్నాడు. టీమిండియాలో స్థానంలో కోల్పోయిన వెంకటేష్ అయ్యర్ ఫామ్ లోకి వస్తే కేకేఆర్‌కు తిరుగుండదు.