Page Loader
కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్ రేసులో రసెల్..?
కోల్ కతా కెప్టెన్సీ బరిలో అండ్రీ రసెల్

కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్ రేసులో రసెల్..?

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 25, 2023
11:03 am

ఈ వార్తాకథనం ఏంటి

ఐపీఎల్ సమరం మరికొద్ది రోజుల్లో ప్రారంభ కానుంది. ఈ నేపథ్యంలో పలు స్టార్ ఆటగాళ్లు గాయం కారణంగా ఐపీఎల్‌కు దూరమయ్యారు. కోల్‌కత్తా రెగ్యులర్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ గాయం కారణంగా మొత్తం ఐపీఎల్ సీజన్ నుంచి దూరమయ్యే అవకావాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అతని స్థానంలో కెప్టెన్ పదవి ఎవరికి ఇవ్వాలో కోల్ కత్తా నైట్ రైడర్స్ కసరత్తును ప్రారంభించింది. తాజాగా ఆయ్యర్ స్థానంలో ఆల్ రౌండర్ ఆండ్రీ రసెల్ కు సారథ్య బాధ్యతలను అప్పగిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ అయ్యర్ దూరమైతే కెప్టెన్‌గా ఎవరిని ఎంపిక చేయాలన్నది కోల్ కతా మేనేజ్ మెంట్ కు ఛాలెంజింగ్ మారింది.

రసెల్

జట్టు విజయాల్లో అండగా నిలుస్తున్న రసెల్

కెప్టెన్సీలో న్యూజిలాండ్ పేస‌ర్ టీమ్ సౌథీ, బంగ్లా ఆల్ రౌండ‌ర్ ష‌కీబ్‌ల‌కు అనుభ‌వం ఉన్నా జ‌ట్టు కూర్పు దృష్ట్యా అన్ని మ్యాచ్‌లలో వారిని ఆడించ‌డం అనుమాన‌మే. ఈ నేపథ్యంలో అండ్రీ రసెల్ జట్టు పగ్గాలను అప్పగించాలని మేనేజే‌మెంట్ భావిస్తోంది. కొన్నేళ్లుగా బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ కోల్ కతాను అతను అదుకుంటున్నాడు. ఈ సంద‌ర్భంగా ఐపీఎల్ 2023 సీజ‌న్‌పై ర‌సెల్ ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేశాడు. మేనేజ్‌మెంట్‌తో పాటు కోల్‌క‌తా ఫ్యాన్స్‌ను త‌న ఆట‌తీరుతో సంతృప్తి ప‌రిచేందుకు కృషిచేస్తాన‌ని ర‌సెల్ అన్నాడు. గ‌త సీజ‌న్‌లో 174 స్ట్రైక్ రేట్‌తో 335 ర‌న్స్ చేశాడు కోల్ కతా జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.