LOADING...
ఐపీఎల్‌కు ముందు కేకేఆర్‌కు బిగ్‌షాక్
ప్రాక్టీసులో గాయపడ్డ నితీష్ రాణా

ఐపీఎల్‌కు ముందు కేకేఆర్‌కు బిగ్‌షాక్

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 24, 2023
04:45 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఐపీఎల్-2023 సీజన్ ఆరంభానికి ముందు కోల్‌కతా నైట్ రైడర్స్‌కి మరో గట్టి షాక్ తగిలింది. ఇప్పటికే కేకేఆర్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, స్టార్ బౌలర్ లాకీ ఫెర్గూసన్ ఐపీఎల్ సీజన్‌కు దూరమయ్యాడు. గురువారం జరిగిన ప్రాక్టీస్ సెషన్‌లో ఆ జట్టు స్టార్ బ్యాటర్ నితీష్ రాణా చిలమండకు గాయమైనట్లు సమాచారం. దీంతో అతడు ఆరంభ మ్యాచ్‌లకు దూరంగా కానున్నట్లు పలు నివేదకలు పేర్కొంటున్నాయి. ప్రస్తుతం రాణా గాయపడటంతో కేకేఆర్ ను మరింత కలవరపడుతోంది. ఒకరి తర్వాత ఒకరు జట్టులో గాయపడుతుండంతో కేకేఆర్ అభిమానులు నిరాశకు గురవుతున్నారు.

కేకేఆర్

కేకేఆర్ కెప్టెన్సీ రేసులో సునీల్ నరైన్, టీమ్ సౌథీ

ప్రస్తుతం కేకేఆర్ కొత్త కెప్టెన్‌ను ఎంపిక చేయడానికి కసరత్తులు చేసింది. ఈ విషయాన్ని రెండు మూడు రోజల్లో ప్రకటించే అవకాశం ఉన్నట్లు పలు నివేదకలు స్పష్టం చేశాయి. కేకేఆర్ కెప్టెన్సీ రేసులో ఆల్ రౌండర్ సునీల్ నరైన్‌తో పాటు న్యూజిలాండ్ టెస్టు కెప్టెన్ టీమ్ సౌథీ ఉన్నారు. వీరిద్దరి ఒకరిని కెప్టెన్‌గా ఎన్నుకొనే అవకాశం ఉంటుంది. ఇదిలా ఉండగా.. ఐపీఎల్ 16వ సీజన్ మార్చి 31 నుండి ప్రారంభం కానుంది. కేకేఆర్ తొలి మ్యాచ్‌లో ఏప్రిల్ 1న పంబాజ్ కింగ్స్‌తో తలపడనుంది.