శ్రేయస్ అయ్యర్ గాయంపై టీమిండియా మాజీ ప్లేయర్ కామెంట్స్
టీమిండియా స్టార్ బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్ వెన్ను సంబంధిత సమస్యతో భాదపడుతున్నాడు. దీంతో ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో ఆడలేకపోయిన అయ్యర్.. నాలుగో టెస్టులో సభ్యుడిగా ఉన్నప్పటికీ బ్యాటింగ్‌కు దిగలేదు. దీంతో వెన్నుముక సమస్యకు సర్జరీ చేయించుకోవాలని శ్రేయాస్‌కు బీసీసీఐ సూచించింది. సర్జరీ జరిగితే 6-7 నెలల పాటు విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుంది. అదే జరిగితే ఐపీఎల్, 2023 వరల్డ్ కప్‌కు అయ్యర్ దూరమయ్యే అవకాశం ఉంటుంది. దీనిపై తాజాగా టీమిండియా మాజీ ప్లేయర్ అజయ్ జడేజా ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ఈ రోజుల్లో వెన్ను సమస్య భారీన ప్రతి ప్లేయర్ పడుతున్నాడని, తాము ఆడిన రోజుల్లో ఇలాంటి సమస్యలు వచ్చేవి కాదన్నారు.
శ్రేయస్ అయ్యర్ త్వరగా కోలుకోవాలి
బ్యాట్‌మెన్స్ కు కూడా వెన్ను శస్త్ర చికిత్సలు జరగడం అశ్చర్యకరంగా ఉందని, అయితే ఇదంతా ఆటలో భాగమేనని, గాయాల భారీన తరుచూ ప్లేయర్స్ పడతారని, శ్రేయస్ అయ్యర్ తర్వగా కోలుకోవాలని అజయ్ జడేజా ఆకాంక్షించాడు. ఐపీఎల్ సీజన్ మరో వారంలో ప్రారంభం కానుంది. అయ్యర్ ఐపీఎల్‌లో పాల్గొంటాడా లేదా అన్న విషయంపై కోల్ కత్తా నైట్ రైడర్స్ ఇంకా ధ్రువీకరించకపోవడం గమనార్హం. అయితే ప్రారంభ మ్యాచ్‌లకు అయ్యర్ దూరమయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వెన్ను నొప్పిని తగ్గించడం కోసం ఇటీవలే అయ్యర్ కు ఆరు ఇంజెక్షన్స్ ఇచ్చిన విషయం తెలిసిందే. కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు కొత్త కెప్టెన్ ను నియమించనుంది. కెప్టెన్సీ రేసులో అండ్రీ రసెల్, టీమ్ సౌథీలు ఉన్నారు.