టీమిండియాకు భారీ షాక్.. స్టార్ బ్యాటర్ దూరం
డబ్ల్యూటీసీ ఫైనల్ కు ముందు టీమిండియా కు భారీ షాక్ తగిలింది. భారత మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్ గాయం కారణంగా ఆ ఫైనల్ మ్యాచ్‌కు దూరం కానున్నట్లు సమాచారం. టెస్టు ఛాంపియన్ షిప్ కాకుండా మొత్తం ఐపీఎల్ సీజన్ నుంచి తప్పుకోనున్నట్లు తెలుస్తోంది. వెన్ను నొప్పి కారణంగా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో చివరి టెస్టు అయ్యర్ దూరమయ్యాడు. ప్రస్తుతం గాయం తీవ్రత కారణంగా లండన్ లో సర్జరీ చేసుకునేందుకు సిద్ధమవుతున్నాడట. సర్జరీ బీసీసీఐ వైద్యుల పర్యవేక్షణలోనే జరగనుందట. ఈ సర్జరీ తర్వాత కనీసం ఐదు నెలలు క్రికెట్ కు శ్రేయస్ అయ్యర్ అందుబాటులో ఉండడని తెలుస్తోంది.
ఐపీఎల్‌కు శ్రేయస్ అయ్యర్ దూరం
ఇప్పటికే గాయం కారణంగా ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్, ఐపీఎల్ కు టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రిత్ బూమ్రా దూరమైన విషయం తెలిసిందే. తాజాగా అయ్యర్ కూడా దూరం కావడంతో టీమిండియా గట్టి షాక్ తగిలింది. వీరిద్దరి స్థానంలో టీమిండియా ప్రత్యామ్నాయ ప్లేయర్ ఎంపిక చేయడంతో కసరత్తు ప్రారంభించింది. కోల్ కత్తా నైట్ రైడర్స్ కెప్టెన్స్ గా శ్రేయస్ అయ్యర్ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ప్రస్తుతం అతను ఐపీఎల్ కు దూరం కావడంతో కేకేఆర్ పగ్గాలు ఎవరు చేపడతారనేది ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా కెప్టెన్సీ రేసులో సౌథీ, నితీష్ రాణా లాంటి సీనియర్ ఆటగాళ్ల పేర్లు వినపడుతున్నాయి.