MS Dhoni Come back: ఐపీఎల్ 2026 ముందు ధోని అప్‌డేట్: సీఎస్‌కే అభిమానులకు గుడ్ న్యూస్
ఈ వార్తాకథనం ఏంటి
ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి ఒక్కరోజు మాత్రమే మిగిలి ఉండగా చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులకు మొదట పెద్ద షాక్ తగిలింది. జట్టు కీలక ఆటగాడు ఎంఎస్ ధోని రెండు వారాల పాటు దూరంగా ఉంటాడని సీఎస్‌కే మేనేజ్‌మెంట్ ప్రకటించింది. ఈ వార్తతో ధోని కనీసం నాలుగు నుంచి ఐదు మ్యాచ్‌లు మిస్ అవుతాడని భావించిన అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. అయితే తాజాగా పరిస్థితులు మారుతున్నట్లుగా కనిపిస్తున్నాయి. రెండు వారాల గ్యాప్ కాకుండా ధోని త్వరగానే మైదానంలోకి తిరిగి వచ్చే అవకాశాలు ఉన్నాయని సమాచారం. దీనికి బలం చేకూర్చేలా ధోని నెట్స్‌లో సాధన చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
వివరాలు
చెన్నై వేదికగా పంజాబ్ కింగ్స్ తో సీఎస్‌కే
ప్రాక్టీస్ కోసం తన కిట్‌తో మైదానానికి వెళ్తున్న వీడియోను సీఎస్‌కే అధికారికంగా షేర్ చేయడం అభిమానుల్లో కొత్త ఆశలు రేకెత్తించింది. ఇదిలా ఉండగా,భారీ అంచనాల మధ్య ప్రారంభమైన ఐపీఎల్‌లో సీఎస్‌కేకు తొలి మ్యాచ్‌లోనే నిరాశ ఎదురైంది. రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఓటమి చవిచూసిన చెన్నై జట్టు, ఇప్పుడు తన తదుపరి మ్యాచ్‌పై దృష్టి పెట్టింది. శుక్రవారం చెన్నై వేదికగా పంజాబ్ కింగ్స్ తో సీఎస్‌కే తలపడనుంది. ఈ మ్యాచ్‌లో ధోని ఆడతాడా లేదా అనేది ఇంకా స్పష్టత రాలేదు. .
వివరాలు
రెండు వారాల్లో నాలుగు మ్యాచ్‌లు
ఇటీవల వరకూ అతను కనీసం నాలుగు మ్యాచ్‌లకు దూరంగా ఉంటాడనే వార్తలు వినిపించాయి. షెడ్యూల్ ప్రకారం సీఎస్‌కే రెండు వారాల్లో నాలుగు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. కానీ ప్రస్తుతం ధోని ప్రాక్టీస్‌లో ఎలాంటి సమస్యలు లేకుండా పాల్గొంటుండటంతో, మూడో మ్యాచ్ నాటికైనా తుది జట్టులోకి తిరిగి వచ్చే అవకాశం ఉందని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు
ట్విట్టర్ పోస్ట్ చేయండి
సీఎస్‌కే అధికారికంగా షేర్ చేసిన వీడియో ఇదే..
Kodiyil Oruvan! 🦁💛#WhistlePodu #Yellove pic.twitter.com/SuztJYGNzr
— Chennai Super Kings (@ChennaiIPL) April 1, 2026