ఎంఎస్ ధోని మార్కు అంటే ఇదే.. వారిని ఆడించి విజేతగా నిలిపాడు
చైన్నై సూపర్ కింగ్స్ జట్టులో ఎక్కువగా వయస్సు మళ్లిన ఆటగాళ్లు ఉండటంతో ఆ జట్టుకు 'డాడీష్ ఆర్మీ' అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు పెడుతుంటారు. చివరి ఆ జట్టే విజేతగా నిలవడంతో అంతా ధోని నాయకత్వ మహిమే అంటూ అభిమానులు చెబుతున్నారు. 2020 లో దుబాయ్ వేదికగా జరిగిన ఐపీఎల్ లో చైన్నై సూపర్ కింగ్స్ పేలవ ప్రదర్శన కొనసాగించింది. తర్వాత ఆ జట్టుపై ఏ మాత్రం అంచనాలు లేకపోయినా చివరికి చైన్నై ఛాంపియన్‌గా నిలిచి అందరి నోళ్లను మూయించింది. ఈ సారీ ఐపీఎల్ లో చైన్నై ఫైనల్లో అడుగు పెట్టిదంటే అందులో ధోని పాత్ర కచ్చితంగా ఉందని చెప్పాలి.
ఎంఎస్ ధోనీ
ఇక ఐపీఎల్ లో ఆడకూడదని భావించిన రహానేని ధోని చైన్నై జట్టులోకి తీసుకొని స్వేచ్ఛగా ఆడించే అవకాశాన్ని కల్పించాడు. ఇప్పటివరకూ ఐపీఎల్ లో పెద్దగా ప్రభావం చూపని శివం దూబే సైతం ఈసారి ఐపీఎల్ లో భీకర ఫామ్ లోకి వచ్చాడంటే అందులో ధోని సహకారం కూడా మరవలేదని చెప్పొచ్చు. లతిస్ మలింగను పోలిన బౌలింగ్ శైలి కలిగిన పతిరణను సైతం ఎంఎస్ ధోని ఉపయోగించుకొని ప్రధాన బౌలింగ్ అస్త్రంగా మార్చాడు. ఎంఎస్ ధోని యువ ప్లేయర్స్ కు ఎంత ప్రాధాన్యత ఇస్తారో ఈ ఐపీఎల్ ను చూసి తెలుసుకోవచ్చు. ఇక ఫైనల్ మ్యాచులో చైన్నై సమిష్టిగా రాణించి అద్భుత విజయాన్ని నమోదు చేసింది.