Page Loader
ధోని కూతురికి సర్‌ప్రైజ్ గిప్ట్‌ను పంపిన మెస్సీ
మెస్సీ పంపిన జెర్సీని ధరించిన జీవా

ధోని కూతురికి సర్‌ప్రైజ్ గిప్ట్‌ను పంపిన మెస్సీ

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 28, 2022
03:23 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఖతార్‌ వేదికగా జరిగిన ఫిఫా ప్రపంచకప్‌ 2022 ట్రోఫీని అర్జెంటీనా గెలుచుకున్న విషయం తెలిసిందే. ఫ్రాన్స్‌పై పెనాల్టీ షూటౌట్‌లో అర్జెంటీనా 4-2 తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో ఫుట్‌బాల్‌ సూపర్‌ స్టార్‌ లియోనెల్‌ మెస్సి కల నేరవేరింది. ఫుట్‌బాల్ లెజెండరీ ప్లేయర్, అర్జెంటీనా సూపర్ స్టార్ లియోనల్ మెస్సీ మరోసారి అభిమానుల మనసు గెలుచుకున్నాడు. తాజాగా మెస్సీ టీమిండియా మాజీ సారిథి మహేంద్రసింగ్ ధోని కూతురికి స్పేషల్ గిప్ట్ పంపాడు. ఏకంగా భారత్‌లో తన ఫ్యాన్స్‌కు ప్రత్యేక బహుమతులు పంపుతున్నాడు. ఇదివరకే బీసీసీఐ ప్రధాన కార్యదర్శి జై షాకు తన ఆటోగ్రాఫ్‌తో ఉన్న జెర్సీని పంపాడు. ఈ జెర్సీని మాజీ క్రికెటర్ ప్రజ్ఞాన్ ఓజా.. జై షాకు అందించాడు.

మెస్సీ

అత్యధిక పారితోషికం పొందుతున్న అథ్లెట్లలో మెస్సీ ఒకడు

తాజాగా మెస్సీ.. టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోని కూతురు జీవాకు కూడా తన జెర్సీని పంపాడు. జెర్సీ మీద 'పారా జీవా' (జీవా కోసం) అని రాసి ఉంది. ఆ జెర్సీ వేసుకున్న జీవా కళ్లలో ఆనందానికి అవధుల్లేవు. ఆ జెర్సీని ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేసింది జీవా. ఈ ఫోటోను చూసి మహేంద్ర సింగ్ ధోని ఫ్యాన్స్ తెగ సంబరపడుతున్నారు. ఇక, ప్రపంచంలోనే అత్యధిక పారితోషికం పొందుతున్న అథ్లెట్లలో మెస్సీ ఒకడు.. నవంబర్ 2022 నాటికి.. లియోనెల్ మెస్సీ నికర విలువ 600 మిలియన్ డాలర్లు.. అంటే రూ.4 వేల 952 కోట్లు మెస్సీ అనేక బ్రాండ్ల ప్రచారం ద్వారా చాలా సంపాదిస్తున్నాడు.