LOADING...
MS Dhoni : రాంచీ వీధుల్లో వింటేజ్ రోల్స్ రాయిస్‌పై ధోని ఎంట్రీ.. వీడియో వైరల్!
రాంచీ వీధుల్లో వింటేజ్ రోల్స్ రాయిస్‌పై ధోని ఎంట్రీ.. వీడియో వైరల్!

MS Dhoni : రాంచీ వీధుల్లో వింటేజ్ రోల్స్ రాయిస్‌పై ధోని ఎంట్రీ.. వీడియో వైరల్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 08, 2025
02:11 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్‌ ఎంఎస్ ధోనికి బైకులు, కార్లంటే ఉన్న ఇష్టం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తరచూ తన లగ్జరీ వాహనాల కలెక్షన్‌తో అభిమానులను ఆశ్చర్యపరుస్తుంటారు. తాజాగా ఆయన మళ్లీ వార్తల్లో నిలిచారు. జార్ఖండ్ రాజధాని రాంచీ వీధుల్లో ధోనీ వింటేజ్ 'రోల్స్ రాయిస్ కారు' నడుపుతూ కనిపించారు. తన ఫామ్‌హౌస్‌ నుంచి కారు బయటకు తీయగానే అభిమానులు వెంటపడి పరుగులు తీశారు. 'ధోనీ.. ధోనీ' అంటూ అరుస్తూ ఆయన కారును ఛేజ్‌ చేశారు. రాయల్‌ లుక్‌ కలిగిన ఆ రోల్స్‌ రాయిస్‌ కారు చూసి ఫ్యాన్స్ ఆశ్చర్యపోయారు. చాలామంది తమ మొబైల్స్‌తో వీడియోలు, ఫొటోలు తీశారు. అవి సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతున్నాయి.

Details

రోల్స్ రాయిస్ కారును డ్రైవ్ చేసిన కారు

ధోనీకి బైకులు, కార్లంటే ఉన్న ప్రేమ అందరికీ తెలిసిందే. ఆయన తరచుగా తన ప్రత్యేకమైన వాహనాలతో బయటకు వస్తారు. ఈసారి ఆయన డ్రైవ్ చేసిన రోల్స్ రాయిస్ కారు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి రిటైర్మెంట్‌ ప్రకటించిన ధోనీ, ప్రస్తుతం ఐపీఎల్‌లో (IPL) మాత్రమే ఆడుతున్నారు. చెన్నై సూపర్ కింగ్స్‌ (CSK) కెప్టెన్‌గా ఐదుసార్లు జట్టును ఛాంపియన్‌గా నిలిపిన ఆయన, ఫిట్‌గా ఉంటే వచ్చే సీజన్‌ వరకు, అంటే ఐపీఎల్‌ 2026లో కూడా ఆడతానని ఇప్పటికే స్పష్టం చేశారు. ధోనీ సేవలు ఎప్పటికీ తమకు అవసరమేనని సీఎస్కే ఫ్రాంచైజీ పేర్కొంది.