ఐపీఎల్‌లో సీఎస్కే కెప్టెన్‌గా ధోని స్పెషల్ రికార్డు
ఈ వార్తాకథనం ఏంటి
ఐపీఎల్ లో చైన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఓ అరుదైన మైలురాయిని చేరుకోబోతున్నాడు. ఇప్పటివరకూ ఏ క్రికెటర్‌కు సాధ్యం కానీ స్పెషల్ రికార్డును ధోని అధిగమించనున్నాడు. నేడు రాజస్థాన్ రాయల్స్‌తో చైన్నై సూపర్ కింగ్స్ తలపడనుంది.
అయితే ఐపీఎల్‌లో ధోని కెప్టెన్ గా ఇది 200వ మ్యాచ్ కావడం గమనార్హం. ఐపీఎల్ ప్రారంభం సీజన్ నుంచి ధోని సీఎస్కేకు కెప్టెన్ గా వ్యవరిస్తున్నాడు.
నేటి మ్యాచ్ తో 200వ మ్యాచ్ కు సారథిగా ఆ ఘనతను ధోని సాధించనున్నాడు. ఇప్పటికే ధోని నేతృత్వంలో చైన్నై 2010, 2011, 2018, 2021 సంవత్సరాల్లో ట్రోఫిని ముద్దాడింది.
ధోని
ఐపీఎల్‌లో 5వేల పరుగులు సాధించిన ధోని
ధోని ఇప్పటివరకూ 213 ఐపీఎల్ మ్యాచ్ లకు కెప్టెన్సీని చేపట్టాడు. అందులో 125 మ్యాచ్ లు విజయం సాధించగా.. 87 మ్యాచ్ లో చైన్నై పరాజయం పాలైంది. ఇందులో విజయశాతం 58.96శాతంగా ఉంది.
రైజింగ్ పుణే వారియర్స్ జట్టుకు కూడా ధోని కెప్టెన్ గా పనిచేశాడు. ఆ రెండేళ్లలో పుణే తరుపున 14 మ్యాచ్ లను ఆడాడు.
ఇప్పటివరకూ ధోని ఐపీఎల్‌లో 39.09 సగటుతో 5004 పరుగులు చేశాడు. ఇందులో 24 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.