LOADING...
IND Vs ENG 3rd Test: ఇంగ్లండ్‌తో మూడో టెస్టు.. సర్ఫరాజ్-జురెల్ కి అవకాశం..? 
ఇంగ్లండ్‌తో మూడో టెస్టు.. సర్ఫరాజ్-జురెల్ కి అవకాశం..?

IND Vs ENG 3rd Test: ఇంగ్లండ్‌తో మూడో టెస్టు.. సర్ఫరాజ్-జురెల్ కి అవకాశం..? 

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 14, 2024
11:50 am

ఈ వార్తాకథనం ఏంటి

ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా గురువారం రాజ్‌కోట్‌లోని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో భారత్, ఇంగ్లండ్ జట్లు తలపడనున్నాయి. ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను 1-1తో సమం చేయడంతో రాజ్‌కోట్‌లో ఇరు జట్లు ఆధిక్యం సాధించేందుకు ఉవ్విళ్లూరుతున్నాయి. అయితే శ్రేయాస్ అయ్యర్ స్థానంలో రాజ్‌కోట్‌ టెస్టులోసర్ఫరాజ్ ఖాన్ అరంగేట్రం చేస్తాడు. మొదటి రెండు మ్యాచ్‌లలో వికెట్ కీపర్ బ్యాటర్ KS భరత్ విఫలమవడం కీపర్‌ జురెల్‌కు కలిసి రానుంది. మంగళవారం ప్రాక్టీస్‌ సెషన్‌లో వీరిద్దరు మాత్రం గంటల తరబడి చెమటోడ్చడం చూస్తుంటే వారి అరంగేట్రానికి సూచనగా కనిపిస్తోంది.

Details 

ఇరు జట్లలోని సభ్యులు 

ముఖేష్ కుమార్ స్థానంలో మహమ్మద్ సిరాజ్ కూడా భారత XIకి తిరిగి వస్తాడని భావిస్తున్నారు. రవీంద్ర జడేజా ఫిట్‌నెస్‌పై ఇంకా ఎటువంటి అప్‌డేట్ లేదు, అంటే అక్షర్ పటేల్, అశ్విన్, కుల్దీప్ యాదవ్‌లు భారత లైనప్‌లో ముగ్గురు స్పిన్నర్లుగా ఉండే అవకాశం ఉంది. టీమిండియా 11 ప్రాబబుల్స్‌: రోహిత్ శర్మ,యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, రజత్ పటీదార్, సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, సౌరభ్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్. ఇంగ్లండ్ 11 ప్రాబబుల్స్: జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఆలీ పోప్, జో రూట్, బెన్ స్టోక్స్,జానీ బెయిర్‌స్టో, బెన్ ఫోక్స్, టామ్ హార్ట్లీ, షోయబ్ బషీర్, రెహాన్ అహ్మద్,జేమ్స్ ఆండర్సన్.