Page Loader
PBKS vs RR: ధ్రువ్ జురెల్ పోరాటం వృథా.. పంజాబ్ చేతిలో రాజస్థాన్ ఓటమి
ధ్రువ్ జురెల్ పోరాటం వృథా.. పంజాబ్ చేతిలో రాజస్థాన్ ఓటమి

PBKS vs RR: ధ్రువ్ జురెల్ పోరాటం వృథా.. పంజాబ్ చేతిలో రాజస్థాన్ ఓటమి

వ్రాసిన వారు Jayachandra Akuri
May 18, 2025
07:24 pm

ఈ వార్తాకథనం ఏంటి

జైపూర్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌పై పంజాబ్ కింగ్స్ 10 పరుగుల తేడాతో విజయం సాధించింది. 220 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్, నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 209 పరుగులకే పరిమితమైంది. ఓపెనర్ యశస్వీ జైస్వాల్ అర్ధసెంచరీ (50)తో మెరిశాడు. సూర్యవంశీ 40 పరుగులు చేయగా, మిడిల్ ఆర్డర్‌లో ధ్రువ్ జురెల్ 53 పరుగులతో పోరాటం చేశాడు. అయితే మిగతా బ్యాటర్లు ఆశించిన ప్రదర్శన చూపలేకపోయారు.

Details

రాణించిన పంజాబ్ బౌలర్లు

పంజాబ్ బౌలర్లలో హర్‌ప్రీత్ మూడు వికెట్లు తీయగా, ఒమర్జాయ్ మరియు మర్కో జాన్సన్ తలా రెండు వికెట్లు తీసి విజయానికి ముఖ్య కారణంగా నిలిచారు. ఈ గెలుపుతో పంజాబ్ కింగ్స్ తన ఖాతాలో 17 పాయింట్లు కలిపి, ప్లే ఆఫ్ బర్తును దాదాపుగా ఖరారు చేసుకుంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

10 పరుగుల తేడాతో పంజాబ్ విజయం