Page Loader
మల్లికా సాగర్‌పై పొగడ్తల వర్షం కురిపించిన దినేష్ కార్తీక్
మల్లికా సాగర్‌పై ప్రశంసలు కురిపించిన దినేష్ కార్తీక్

మల్లికా సాగర్‌పై పొగడ్తల వర్షం కురిపించిన దినేష్ కార్తీక్

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 14, 2023
10:56 am

ఈ వార్తాకథనం ఏంటి

బీసీసీఐ నిర్వహించిన ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ వేలం ముగిసింది. ముంబై వేదికగా జరిగిన ఈ వేలంలో ఐదు ఫ్రాంచేజీలు పాల్గొన్నాయి. 87 మంది ఆటగాళ్లపై రూ.59.5 కోట్లకు ఐదు ఫ్రాంచైజీలు కొనుగోలు చేశాయి. అయితే ఈ వేలంలో పాటలో ఒకరు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా అమారాయి. అమె ఎవరో కాదు మల్లికా సాగర్.. ఆమె విజయవంతంగా ఉమెన్స్ ఐపీఎల్ ప్రీమయర్ ఆక్షన్‌ను నిర్వహించింది. ఇంతకుముందు ప్రో కబడ్డీ లీగ్ వేలం పాటను కూడా మల్లికా సాగర్ చేపట్టింది. ముంబైకి చెందిన మల్లికా సాగర్ ఆర్ట్ క‌లెక్ట‌ర్, క‌న్స‌ల్టెంట్‌గా గుర్తింపు పొందారు. భార‌తీయ క‌ళ‌పై గొప్ప ఆస‌క్తి ఉంది. మల్లికా సాగర్‌పై టీమిండియా వికెట్ కీపర్ దినేష్ కార్తీక్ తాజాగా ప్రశంసల వర్షం కురిపించారు.

మల్లికా సాగర్‌

మల్లికా సాగర్‌ను ఎంపిక చేయడం గొప్ప విషయం

మల్లికా సాగర్ ఒక అద్భుతమైన వేలం నిర్వాహకురాలని, నమ్మకంగా, ఎంతో ధైర్యంగా వేలాన్ని నిర్వహించిందని దినేష్ కార్తీక్ తన ట్విట్టర్ ద్వారా ఖాతాలో పోస్టు చేశాడు. వేలం కోసం ఆమెను బీసీసీఐ ఎంపిక చేయడం గొప్ప విషయమని దినేష్ కార్తీక్ కొనియాడారు. మహిళల ప్రీమియర్ లీగ్ వేలం బాధ్యతలను తనకు అప్పగించినందుకు చాలా గర్వంగా ఉందని, వేలానికి ముందు ఓ ఇంటర్వ్యూలో మల్లిక తెలిపారు. అయితే ఈ వేలంలో భారత స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన అత్యధిక ధరకు అమ్ముపోయిన విషయం తెలిసిందే.