ఐపీఎల్‌లో 114 వికెట్లు తీసినా.. వేలంలో చుక్కెదురు
ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ఎక్కువ మంది వీక్షించే లీగుల్లో ఐపీఎల్ ఒకటి. భారత్ ఫాస్ట్ బౌలర్, టీ20 స్పెషలిస్ట్ అయిన సందీప్ శర్మకి ఈ వేలంలో చుక్కెదురైంది. 10మంది ప్రాంచేజీ ఉన్నా.. ఏ ఒక్క ప్రాంచేజీ సందీప్ శర్మ కొనుగోలు చేయడానికి ముందుకు రాలేదు. ఐపీఎల్ ఆడిన 10 సీజన్లలో 7.77 ఏకనామీతో 114 వికెట్లు తీసి మెరుగైన ప్రదర్శన కనభరిచాడు. సందీప్ శర్మ 2013లో అప్పటి కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తరఫున అరంగేట్రం చేశాడు. IPL చరిత్రలో అత్యుత్తమ పవర్‌ప్లే బౌలర్‌లలో సందీప్ శర్మ ఒకడు. డెత్ ఓవర్లలో కూడా సమర్థవంతంగా వికెట్లు తీసే నైపుణ్యం ఉంది. ఇటీవల మధ్యప్రదేశ్‌తో జరిగిన రంజీ ట్రోఫీలో చండీగఢ్‌కు ఆడుతూ 7 వికెట్లు తీశారు.
'నేను నిరాశకు గురయ్యా' : సందీప్ శర్మ
దీనిపై సందీశ్ శర్మ స్పందించాడు. "నేను షాక్ అయ్యాను, నిరాశకు గురయ్యాను. నేను ఎందుకు అమ్ముడుపోకుండా ఉన్నానో నాకు తెలియదు. నేను ఏ జట్టు కోసం ఆడినా బాగా రాణించాను. నా కోసం ఏదైనా జట్టు వేలం వేస్తుందని నిజంగా అనుకున్నాను. ఎక్కడ తప్పు జరిగిందో కూడా తెలియదు' అని బాధపడ్డాడు. ప్రస్తుతం టోర్నమెంట్‌లో ప్రముఖ వికెట్లు తీసిన ఆటగాళ్ల జాబితాలో 13 స్థానంలో సందీప్ శర్మ ఉన్నాడు. ఇతని కంటే వెనుక వినయ్ కుమార్, జహీర్ ఖాన్, అక్షర్ పటేల్ ఉండడం గమనార్హం. అయితే ఈ ఐపీఎల్ వేలంలో సందీప్ శర్మకు అన్యాయం జరిగిందని చెప్పొచ్చు. బాగా రాణిస్తున్న ఆటగాళ్లపై ప్రాంచేజీలు దృష్టి సారించడం లేదని పలువురు మాజీఆటగాళ్లు విమర్శలు చేస్తున్నారు.