Page Loader
ప్చ్.. మళ్లీ నిరాశపరిచన పీవీ సింధు.. తొలి రౌండ్‌లోనే ఔట్!
ప్చ్.. మళ్లీ నిరాశపరిచన పీవీ సింధు.. తొలి రౌండ్‌లోనే ఔట్!

ప్చ్.. మళ్లీ నిరాశపరిచన పీవీ సింధు.. తొలి రౌండ్‌లోనే ఔట్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 27, 2023
12:59 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత స్టార్ షట్లర్ పివి.సింధు వరుస వైఫల్యాలతో పరాజయాలను చవిచూస్తోంది. జపాన్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్ 750 టోర్నీలో పీవీ సింధు తొలి రౌండ్‌లోనే నిష్క్రమించింది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ మ్యాచులో 12-21, 13-21 తేడాతో చైనాకు చెందిన జాంగ్ యి మన్‌, పీవీ సింధును చిత్తు చేసింది. ఈ ఏడాది ఆడిన 13 బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ టోర్నీల్లో ఆమె ఏడింట్లో తొలి రౌండ్‌లోనే ఇంటిదారి పట్టడం గమనార్హం. ఇంకా ఒలింపిక్స్ ఏడాది మాత్రమే సమయం ఉంది. ఇలాంటి తరుణంలో ఆమె చెత్త ప్రదర్శన కొనసాగిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. చెైనాకు చెందిన జాంగ్ యి మన్ కు ఏ దశలోనూ కనీస పోటీ ఇవ్వకపోయింది.

Details

సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి జోడి శుభారంభం

మరోవైపు సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి జోడి శుభారంభం అందించారు. ఇండోనేషియా ద్వయం లియో రోలీ, డానియల్ మార్టిన్‌పై 21-16, 11-21, 21-13తో సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి విజయం సాధించారు. ఇక పురుషుల సింగిల్స్‌లో లక్ష్యసేన్ 21-15, 12-21, 24-22తో ప్రియాంశు రజావత్‌‌ను మట్టికరిపించాడు. మంగళవారం జరిగిన సింగిల్స్ మ్యాచ్‌లో కిదాంబి శ్రీకాంత్, హెచ్‌ఎస్ ప్రణయ్ శుభారంభం చేయగా, రెండో రౌండ్ లో ఈ ఇద్దరే తలపడనున్నారు.