Page Loader
Rohit - Gambhir: రోహిత్ - గంభీర్ మధ్య వివాదం.. క్లారిటీ ఇచ్చిన రాజీవ్ శుక్లా 
రోహిత్ - గంభీర్ మధ్య వివాదం.. క్లారిటీ ఇచ్చిన రాజీవ్ శుక్లా

Rohit - Gambhir: రోహిత్ - గంభీర్ మధ్య వివాదం.. క్లారిటీ ఇచ్చిన రాజీవ్ శుక్లా 

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 14, 2025
12:45 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆస్ట్రేలియా పర్యటన సమయంలో భారత కెప్టెన్ రోహిత్ శర్మ, ప్రధాన కోచ్ గౌతమ్‌ గంభీర్‌ల మధ్య వివాదం గురించి వచ్చిన వార్తలను బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా ఖండించారు. జట్టులో ఎలాంటి సమస్యలు లేవని, రోహిత్ శర్మ, గంభీర్, అజిత్ అగార్కర్‌ల మధ్య ఎలాంటి వివాదం లేదని స్పష్టం ఆయన స్పష్టం చేశారు. సిడ్నీ టెస్టు నుంచి రోహిత్ శర్మను పక్కన పెట్టారని వచ్చిన వార్తలు అవాస్తవమని తెలిపారు. ఫామ్‌తో ఇబ్బందిపడుతున్న రోహిత్‌కు గంభీర్ మద్దతుగా నిలిచాడని, రోహిత్ కెప్టెన్సీ విషయంలో వచ్చిన వార్తలు కూడా నిజం కాదని పేర్కొన్నారు. బీసీసీఐ సమీక్ష సమావేశంలో రోహిత్ శర్మ కెప్టెన్‌గా కొనసాగుతానని ప్రకటించినట్లు వచ్చిన వార్తలపై కూడా ఆయన వివరణ ఇచ్చారు.

Details

రోహిత్ శర్మనే సిడ్నీ టెస్టు నుంచి తప్పుకున్నాడు

ఆటలో ఫామ్ క్షీణించడం సహజమైన విషయం, ప్రతి క్రికెటర్‌కు ఇలాంటి దశ వస్తుందని ఆయన చెప్పారు. రోహిత్ శర్మ తన ఫామ్‌ను గమనించి, సిడ్నీ టెస్టు నుంచి తప్పుకున్నారని తెలిపారు. సమీక్ష సమావేశంలో జట్టు ప్రదర్శన, దానిపై చర్చించినట్లు శుక్లా పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఆటగాళ్ల వేతనాలపై కూడా చర్చలు జరిగాయని సమాచారం. ప్రదర్శన ఆధారంగా ఆటగాళ్ల వేతనాలు పెంచడం లేదా తగ్గించడం అనే అంశం కొద్దిగా దృష్టిలో పెట్టుకుంది. బోర్డు, కార్పొరేట్ అప్రైజల్ సిస్టమ్‌ను ప్రవేశపెట్టాలని ఆలోచనలో ఉందని, ప్రదర్శనలో అంచనాలకు తగ్గట్లుగా కోతలు విధించే అవకాశం ఉందని తెలుస్తోంది.