Page Loader
టెన్నిస్ స్టార్ జొకోవిచ్‌కు మరోసారి 'వాక్సిన్' షాక్
ఇండియన్‌ వెల్స్‌కు జకోవిచ్‌ దూరం

టెన్నిస్ స్టార్ జొకోవిచ్‌కు మరోసారి 'వాక్సిన్' షాక్

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 07, 2023
04:23 pm

ఈ వార్తాకథనం ఏంటి

కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోని వరల్డ్ నంబర్ వన్ టెన్నిస్ స్టార్ నొవాక్ జొకోవిచ్‌కు మరోసారి చేదు అనుభవం ఎదురైంది. అమెరికాలో ఈనెల 19 నుంచి జరగనున్న ఇండియన్ వెల్స్‌తో పాటు మయామి టోర్నిల్లో జొకోవిచ్ పాల్గొనాల్సి ఉంది. అయితే కరోనా టీకా తీసుకోని టెన్నిస్ దిగ్గజం జకోవిచ్ మరోసారి టోర్నికి దూరం కావాల్సి వచ్చింది. టీకా వేసుకోని విదేశీయులను తమ దేశంలోకి అమెరికా అనుమతించడం లేదు. కరోనా టీకా నుంచి తనకు మినహాయింపు ఇవ్వాల్సిందిగా నొవాక్ జొకోవిచ్ చేసిన విజ్ఞప్తిని హోమ్‌లాండ్‌ సెక్యూరిటీ అధికారులు తిరస్కరించారు. అమెరికా కోవిడ్ ఎమర్జెన్సీ నిబంధనలు మే 11 వరకు అమల్లో ఉండనున్నాయి.

జొకోవిచ్

టీకా తీసుకోకపోవడంతో గతేడాది ఆస్ట్రేలియన్ ఓపెన్‌ను జొకోవిచ్ దూరం

టీకా తీసుకోని కారణంగా గతేడాది ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌, యుఎస్‌ ఓపెన్‌ టోర్నీలకూ జకో దూరమైన సంగతి తెలిసిందే. దక్షిణ కాలిఫోర్నియాలో జరిగే ఇండియన్‌ వెల్స్‌ టోర్నీలో ఆడేందుకు ప్రత్యేక అనుమతి ఇవ్వాల్సిందిగా జకోవిచ్‌ అమెరికా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయగా.. ఫలితం లేకుండా పోయింది. దీంతో టోర్నీ నుంచి వైదొలుగుతున్నట్లు జొకోవిచ్ స్వయంగా ప్రకటించాడు.