
IPL 2025: ప్లేఆఫ్స్ రేసులో ముంబయి, ఢిల్లీకి ఇంకా ఆశలు ఉన్నాయా?
ఈ వార్తాకథనం ఏంటి
ఢిల్లీ క్యాపిటల్స్‌పై విజయం సాధించిన గుజరాత్ టైటాన్స్ (GT), ఐపీఎల్ 2025 సీజన్‌లో ప్లేఆఫ్స్ చేరిన తొలి జట్టుగా గుర్తింపు పొందింది. గుజరాత్ గెలుపుతో పాటు, ఢిల్లీ ఓటమితో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), పంజాబ్ కింగ్స్ (PBKS) కూడా ప్లేఆఫ్స్ అర్హతను సాధించాయి. ఇప్పుడు ఈ మూడు జట్లు టాప్-2 స్థానాల కోసం పోటీ పడనున్నాయి.
Details
గుజరాత్ టైటాన్స్ (GT)
ఢిల్లీపై విజయం అనంతరం గుజరాత్ టైటాన్స్ 18 పాయింట్లతో ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించింది. మరో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండటంతో, అవి గెలిస్తే మొత్తం 22 పాయింట్లతో టేబుల్ టాప్‌లో నిలిచే అవకాశముంది. శుభ్‌మన్ గిల్ నాయకత్వంలోని జట్టు ఈ సీజన్‌లో అద్భుత ప్రదర్శన చూపిస్తోంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) గుజరాత్ విజయం ద్వారా ఆర్‌సీబీకి ప్లేఆఫ్స్ టికెట్ దక్కింది. మిగిలిన రెండు మ్యాచుల్లో గెలిస్తే 21 పాయింట్లు సాధించవచ్చు. అదే సమయంలో గుజరాత్ ఒక మ్యాచ్‌లో ఓడితే, ఆర్‌సీబీ టాప్-2లో చోటు దక్కించుకునే అవకాశం ఉంది.
Details
పంజాబ్ కింగ్స్ (PBKS)
పంజాబ్ కూడా ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించింది. తమ మిగిలిన రెండు మ్యాచ్‌లను గెలిస్తే, జీటీ లేదా ఆర్‌సీబీ ఒక మ్యాచ్‌లో ఓడితే, శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలోని పంజాబ్‌కు టాప్-2లో చోటు దక్కనుంది. ముంబయి ఇండియన్స్ (MI) ప్రస్తుతం 12 మ్యాచుల్లో 14 పాయింట్లతో ఉన్న ముంబయి ఇండియన్స్ కి టాప్-4లోకి చేరాలంటే రెండు మ్యాచ్‌లు తప్పనిసరిగా గెలవాలి. అయితే ఒక మ్యాచ్ గెలిచినా, నెట్ రన్‌రేట్ బాగుండటంతో ప్లేఆఫ్స్ అవకాశాలు ఉన్నాయి. అయినా ఇది ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడి ఉంటుంది.
Details
ఢిల్లీ క్యాపిటల్స్ (DC)
గుజరాత్ చేతిలో ఓటమి ఢిల్లీకి కష్టతరమైన పరిస్థితిని తీసుకొచ్చింది. ప్రస్తుతం 13 పాయింట్లతో ఐదో స్థానంలో ఉంది. మిగిలిన రెండు మ్యాచుల్లో ముంబయి, పంజాబ్‌పై గెలవాలి. అలాగే పంజాబ్ చేతిలో ముంబయి ఓడిపోవాలి. అప్పుడు ఢిల్లీకి 17 పాయింట్లతో ప్లేఆఫ్స్ అవకాశం ఉంటుంది. లక్నో సూపర్ జెయింట్స్ (LSG) 11 మ్యాచుల్లో 10 పాయింట్లతో ఏడో స్థానంలో ఉన్న ఎల్ఎస్‌జీకి ప్లేఆఫ్స్ చేరడం అంత సులభం కాదు. మిగిలిన మూడు మ్యాచ్‌లు తప్పకుండా గెలవాలి. ఇవాళ సన్‌రైజర్స్‌తో జరిగే మ్యాచ్‌లో ఓడితే వారి అవకాశాలు ముగుస్తాయి. గెలిస్తే రేసులో ఉంటుంది. అంతేకాదు, ఇతర జట్ల ఫలితాలపై కూడా వారి భవితవ్యం ఆధారపడి ఉంటుంది.