LOADING...
SRH vs RCB :టాప్-2 కోసం సన్‌రైజర్స్ ఫైట్.. ఆర్‌సీబీపై భారీ విజయం తప్పనిసరి
టాప్-2 కోసం సన్‌రైజర్స్ ఫైట్.. ఆర్‌సీబీపై భారీ విజయం తప్పనిసరి

SRH vs RCB :టాప్-2 కోసం సన్‌రైజర్స్ ఫైట్.. ఆర్‌సీబీపై భారీ విజయం తప్పనిసరి

వ్రాసిన వారు Moogati Shabari
May 22, 2026
05:08 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఐపీఎల్ 2026 సీజన్ చివరి దశకు చేరుకుంది. ఇప్పటికే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, సన్‌ రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్ జట్లు ప్లేఆఫ్స్‌లోకి అడుగుపెట్టాయి. ఇక మిగిలిన ఒకే ఒక్క ప్లేఆఫ్స్ స్థానం కోసం రాజస్థాన్, కోల్‌కతా నైట్‌రైడర్స్, పంజాబ్, ఢిల్లీ జట్లు పోటీపడుతున్నాయి. మరోవైపు పాయింట్ల పట్టికలో టాప్-2లో నిలిచేందుకు ఆర్‌సీబీ, గుజరాత్, సన్‌రైజర్స్ మధ్య గట్టి పోటీ నెలకొంది. టాప్-2లో నిలిచిన జట్లకు క్వాలిఫయర్-1 ఆడే అవకాశం లభిస్తుంది. దీంతో ఫైనల్ చేరుకునేందుకు రెండు అవకాశాలు దక్కుతాయి.

వివరాలు

నేడే కీలక పోరు..

ఇదిలా ఉంటే, ఐపీఎల్ 2026లో భాగంగా నేడు (శుక్రవారం, మే 22) హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో కీలక పోరు జరగనుంది. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో 18 పాయింట్లతో ఆర్‌సీబీ అగ్రస్థానంలో ఉండగా, 16 పాయింట్లతో సన్‌రైజర్స్ మూడో స్థానంలో కొనసాగుతోంది. లీగ్ దశలో ఇరు జట్లకూ ఇదే చివరి మ్యాచ్ కావడం విశేషం. ఈ మ్యాచ్‌లో గెలిచి టాప్ ప్లేస్‌ను నిలబెట్టుకోవాలని ఆర్‌సీబీ భావిస్తోంది. మరోవైపు సన్‌రైజర్స్ కూడా విజయం సాధించి టాప్-2లో స్థానం ఖాయం చేసుకోవాలని చూస్తోంది. ఒకవేళ ఈ మ్యాచ్‌లో ఎస్ఆర్‌హెచ్ గెలిస్తే.. ఆర్‌సీబీ, గుజరాత్, సన్‌రైజర్స్ మూడు జట్లు కూడా 18 పాయింట్లతో సమానంగా నిలుస్తాయి.

వివరాలు

నెట్ రన్  రేట్ పైనే అందరి దృష్టి..

ప్రస్తుతం ఆర్‌సీబీ నెట్‌రన్‌రేట్ +1.065గా ఉండగా, గుజరాత్ +0.695తో ఉంది. సన్‌రైజర్స్ నెట్‌రన్‌రేట్ మాత్రం +0.350గా కొనసాగుతోంది. సన్‌రైజర్స్ చేతిలో ఆర్‌సీబీ భారీ తేడాతో ఓడిపోకపోతే బెంగళూరు జట్టుకు పెద్దగా నష్టం ఉండదని విశ్లేషకులు భావిస్తున్నారు. అందువల్ల ఓటమి వచ్చినా కూడా ఆర్‌సీబీ అగ్రస్థానంలో కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Advertisement

వివరాలు

హోరాహోరీగా మ్యాచ్..

అయితే సన్‌రైజర్స్ మాత్రం రెండో స్థానంలోకి రావాలంటే గుజరాత్ నెట్‌రన్‌రేట్‌ను దాటాల్సిందే. అందుకోసం ఆర్‌సీబీపై భారీ విజయం సాధించాల్సి ఉంటుంది. ఎస్ఆర్‌హెచ్ తొలుత బ్యాటింగ్ చేస్తే కనీసం 88 పరుగుల తేడాతో గెలవాల్సి ఉంటుందని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు. ఒకవేళ లక్ష్య ఛేదన చేస్తే 12 ఓవర్లలోపే మ్యాచ్ ముగించాల్సి ఉంటుంది. అలా జరిగితేనే గుజరాత్ నెట్‌రన్‌రేట్‌ను అధిగమించి సన్‌రైజర్స్ రెండో స్థానానికి చేరుకుంటుంది. దీంతో క్వాలిఫయర్-1 ఆడే అవకాశం దక్కుతుంది.

Advertisement