మార్చి నెల ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ ఎవరో తెలుసా?
మార్చి నెల పురుషుల ప్లేయర్ ఆప్ ద మంత్ అవార్డును తాజాగా ఐసీసీ ప్రకటించింది. ఈ అవార్డును బంగ్లాదేశ్ ఆల్ రౌండర్ షకీబ్ అల్ హసన్ గెలుపొందాడు. మార్చి నెలలో వివిధ ఫార్మాట్లో అద్భుత ప్రదర్శన చేసేందుకు అతనికి ఈ అవార్డు లభించింది. ఈ అవార్డు కోసం న్యూజిలాండ్ స్టార్ ఆటగాడు కేన్ విలియమ్సన్, యూఏఈ క్రికెటర్ ఆసీఫ్ ఖాన్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. అయితే చివరికి జ్యూరీ షకీబ్ అల్ హాసన్ నే ఎంచుకుంది. అయితే మహిళల విభాగంలో రువాండాకు చెందిన యువ క్రికెటర్ హెన్రిట్టి ఇషిమ్వే ప్లేయర్ ఆఫ్ ద మంత్ గా ఎంపికైంది.
రెండుసార్లు అవార్డును గెలుచుకున్న షకీబ్ అల్ హసన్
మార్చిలో స్వదేశంలో ఇంగ్లండ్ తో జరిగిన వన్డేలో షకీబ్ అల్ హసన్ విజృంభించిన విషయం తెలిసిందే. అయితే 1-2తేడాతో సిరీస్ కోల్పోయిన బంగ్లా తరుపున టాప్ స్కోరర్ గా నిలిచి సత్తా చాటాడు షకీబ్. ముఖ్యంగా టీ20 సిరీస్ లో ఇంగ్లండ్ ను 3-0 తేడాతో బంగ్లాదేశ్ క్లీన్ స్వీప్ చేసింది. ఈ విజయంలో అతను కీలక పాత్ర పోషించాడు. తర్వాత ఐర్లాండ్ లోజరిగిన సిరీస్‌లోనూ షకీబ్ రాణించారు. మార్చి నెలలో 12 మ్యాచ్‌లు ఆడిన అతను 353 పరుగులు చేశాడు. బౌలింగ్ విభాగంలో 15 వికెట్లు తీశాడు. షకీబ్ ఈ అవార్డు రావడం ఇదో రెండోసారి. 2021 జూలైలో కూడా ఈ ప్రతిష్టాత్మక అవార్డును అతన్ని వరించింది.