LOADING...
వన్డేల్లో షకీబ్ అల్ హసన్ సంచలన రికార్డు
వన్డేలో అరుదైన రికార్డును సాధించిన షకీబ్

వన్డేల్లో షకీబ్ అల్ హసన్ సంచలన రికార్డు

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 07, 2023
01:19 pm

ఈ వార్తాకథనం ఏంటి

వన్డే క్రికెట్‌లో బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ సంచలన రికార్డును సృష్టించారు. ఇంగ్లండ్ తో జరిగిన మూడో వన్డేలో బంగ్లాదేశ్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో షకీబ్ అరుదైన మైలురాయిని సొంతం చేసుకున్నాడు. 71 బంతుల్లో 75 పరుగులు చేయడంతో పాటు నాలుగు వికెట్లను తీశాడు. దీంతో వన్డే క్రికెట్లో 300 వికెట్లు పూర్తి చేసిన తొలి బంగ్లాదేశ్ ప్లేయర్‌గా షకీబ్ చరిత్రకెక్కాడు. షకీబ్ 227 మ్యాచ్‌లలో 300 వన్డే వికెట్లు పూర్తి చేసిన 14వ ప్లేయర్‌గా నిలిచాడు. శ్రీలంక స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ (202) మాత్రమే ఈ ఫీట్‌ని వేగంగా అధిగమించాడు. జయసూర్య (323), డేనియల్ వెట్టోరి (305) వికెట్లు తీసి అతని కంటే ముందు స్థానంలో ఉన్నారు.

షకీబ్

షకీబ్ సాధించిన రికార్డులివే

స్వదేశంలో షకీబ్ 114 వన్డేల్లో 22.79 సగటుతో 178 వికెట్లను పడగొట్టాడు. బంగ్లాదేశ్ బ్యాటర్లలో తమీమ్ ఇక్బాల్ 8,143 పరుగులు చేసి మొదటి స్థానంలో ఉన్నాడు. షకీబ్ 6,976 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు. వన్డేలో పాకిస్థాన్‌కు చెందిన షాహిద్ అఫ్రిది (8,064 పరుగులు, 395 వికెట్లు) జయసూర్య (13,430 పరుగులు, 323 వికెట్లు) షకీబ్ (300 వికెట్లు, 6,000 వేల పరుగులు) చేశారు. గతేడాది భారత్‌తో స్వదేశంలో జరిగిన వన్డే సిరీస్‌లో షకీబ్ వన్డేల్లో 3,000 పరుగులు, 150 వికెట్లు పూర్తి చేసిన మొదటి ఆల్ రౌండర్‌గా నిలిచాడు.