
IPL 2025: ఊసరవెల్లి అనగానే బూతులు? లైవ్‌లో సిద్ధూ-రాయుడు మాటల యుద్ధం!
ఈ వార్తాకథనం ఏంటి
టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు మరోసారి తన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచాడు. తెలుగు ఆటగాడైన రాయుడు, ఐపీఎల్ 2024 సీజన్ నుంచి వివాదాస్పద వ్యాఖ్యలతో నిత్యం న్యూస్‌లో ఉంటున్నాడు.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు, విరాట్ కోహ్లీపై పదేపదే విమర్శలు చేయడంతో పాటు, సోషల్ మీడియాలో హత్యా బెదిరింపులు కూడా ఎదురయ్యాయి.
ఇదంతా ఓ పక్కన పెట్టితే, ఇప్పుడు ఐపీఎల్ 2025 సీజన్‌లో కూడా రాయుడు వివాదాల్లోంచి బయటపడటం లేదు.
తాజాగా హార్దిక్ పాండ్యా వ్యవహారంపై మాజీ క్రికెటర్ సంజయ్ బంగర్‌కు కౌంటర్ ఇచ్చిన రాయుడు, వెంటనే మరుసటి రోజే లైవ్ టీవీలో మరో మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధుతో చిన్నపాటి మాటల తూటాలు పేల్చుకున్నాడు.
Details
సోషల్ మీడియాలో మాటలు వైరల్
మంగళవారం పంజాబ్ కింగ్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ సందర్భంగా కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్న రాయుడు, సిద్ధూకు సరదాగా జోక్ వేశారు.
సిద్ధూ టీమ్‌లను ఊసరవెల్లిలా మార్చుతుంటారని అన్నారు. దీనికి నవ్వుతూ స్పందించిన సిద్ధూ.. ఈ భూమ్మీద ఊసరవెల్లికి అసలైన ప్రతిరూపం నువ్వే అంటూ కౌంటర్ ఇచ్చారు.
ఇద్దరూ తగినంత సరదాగా స్పందించినా, ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. నెటిజన్లు మాత్రం రాయుడుపై తమదైన శైలిలో స్పందిస్తున్నారు.
నిత్యం ఏదో ఒక వివాదంలో తలదూర్చే రాయుడు, మళ్లీ ఎలాంటి వాగ్వివాదానికి కారణం అవుతాడోనని కామెంట్లు పెడుతున్నారు. క్రికెట్ విషయానికొస్తే, రాయుడు భారత్ తరఫున 55 వన్డేలు, 6 టీ20లు ఆడి మొత్తం 1736 రన్స్ చేశాడు.