ఆస్ట్రేలియా మీడియాపై మండిపడ్డ సునీల్ గవాస్కర్
ఇండియా పిచ్‌ల గురించి ఆస్ట్రేలియా మీడియా ప్రస్తుతం చర్చ జరుగుతోంది. భారత్ పిచ్‌లను 'పిచ్ డాక్టరింగ్' అంటూ కాస్త కఠినంగా ఆస్ట్రేలియా మీడియా వ్యవహరిస్తోంది. ఈ వ్యవహారంపై ప్రస్తుతం టీమిండియా మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ స్పందించాడు. తమ చిత్త శుద్ధిని అనుమానించవద్దని ఆస్ట్రేలియా మీడియాకు, మాజీ క్రికెటర్లపై గవాస్కర్ మండిపడ్డారు. కొంతమంది మాజీ ఆటగాళ్లు రుచి లేని వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఆస్ట్రేలియా మీడియా ఎప్పుడు తమకు అనుకూలంగా ఉండే వ్యవహరంపైనే స్పందిస్తుందని, నాగపూర్ పిచ్‌ను డిజి అని తనను నిరాశకు గురి చేసిందని గవాస్కర్ తెలిపారు.
ఆస్ట్రేలియా మాజీ ఆటగాళ్లు విమర్శలు మానుకోవాలి
వాస్తవానికి స్టీవ్ స్మిత్ భారత్‌లో ఆడటానికి ఇష్టపడతాడని, ప్రస్తుతం కొంతమంది ఆస్ట్రేలియా మాజీ ఆటగాళ్లు అనవసర ఆరోపణలు చేస్తున్నారని, 75 ఏళ్ల భారత్-ఆస్ట్రేలియా మధ్య స్నేహం ఉన్న శకంలోకి అడుగుపెడుతున్నామని, అయినా కొందరు మాజీ ఆటగాళ్లు రుచించని పదాలను వాడడం సిగ్గుచేటు అని గవాస్కర్ విమర్శించాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్ మొదటి రెండు మ్యాచ్‌లలో అధిపత్యం ప్రదర్శించగా.. ఇండోర్ జరిగిన టెస్టు మ్యాచ్‌లో భారత్ తొమ్మిది వికెట్ల తేడాతో ఓడిపోయిన విషయం తెలిసిందే.