Mohammed Shami: 'మూర్ఖుల మాటలను పట్టించుకోవద్దు'.. షమీకి బాలీవుడ్ లెజెండ్ సపోర్ట్
ఈ వార్తాకథనం ఏంటి
టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ కొత్త వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే.
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ విరామ సమయంలో షమీ ఎనర్జీ డ్రింక్ తాగడంపై కొందరు ముస్లిం మత పెద్దలు అభ్యంతరం వ్యక్తం చేశారు.
రంజాన్ మాసంలో రోజా పాటించకుండా డ్రింక్ తాగి పెద్ద పాపం చేశాడని జమాత్ సంస్థ చీఫ్ మౌలానా షాబుద్దీన్ రిజ్వి విమర్శలు గుప్పించాడు.
రంజాన్ సందర్భంగా ప్రతి ముస్లిం ఉపవాసం చేయాలని షరియత్‌లో ఉందని, ఆరోగ్యంగా ఉన్న షమీ మ్యాచ్ ఆడుతూ ఎనర్జీ డ్రింక్ తాగడం తప్పని అన్నారు
Details
వివాదంగా మార్చడం సరికాదు
ఈ వివాదంపై మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. కొందరు షమీని తప్పుపట్టగా, మరికొందరు అతనికి మద్దతుగా నిలుస్తున్నారు.
తాజాగా బాలీవుడ్ దిగ్గజ లిరిక్ రైటర్ జావేద్ అక్తర్ కూడా షమీకి మద్దతుగా స్పందించాడు.
ఎక్స్ వేదికగా చేసిన పోస్ట్‌లో షమీ సాహెబ్, ఛాంపియన్స్ ట్రోఫీలో మీరు వాటర్ తాగడంపై కొందరు మూర్ఖులు విమర్శలు చేస్తున్నారు. వారిని పట్టించుకోవాల్సిన పని లేదు.
మీరు గొప్ప భారత జట్టులో భాగమై, దేశాన్ని గర్వపడేలా చేస్తున్నారు. టీమ్ మొత్తానికి నా శుభాకాంక్షలంటూ ఆయన పేర్కొన్నాడు.
ఇక షమీ బంధువు ముంతాజ్ కూడా అతనికి మద్దతుగా నిలిచాడు.
షమీ తన ఆటకు ప్రాధాన్యత ఇచ్చి భారత విజయానికి కృషి చేస్తే, అనవసరంగా ఈ విషయాన్ని వివాదంగా మార్చడం సరికాదని పేర్కొన్నాడు.