IND vs NZ Final:ఫైనల్ సమరం రేపే.. భారత్ vs న్యూజిలాండ్ జట్ల ప్రాక్టీస్ వేగవంతం!
ఈ వార్తాకథనం ఏంటి
టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీని దక్కించుకోవాలన్న దృఢ సంకల్పంతో మెరుగైన ప్రణాళికలు రచిస్తోంది.
మెగాటోర్నీలో ఇప్పటి వరకు ఓటమి లేకుండా విజయవంతంగా సాగుతున్న రోహిత్ సేన, ఫైనల్లో న్యూజిలాండ్‌ను ఎదుర్కోనుంది.
ఈ కీలక పోరుకు సన్నద్ధమవుతున్న ఇరు జట్లు నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నాయి.
గత ఐసీసీ టోర్నీల్లో కివీస్ భారత జట్టుకు గట్టి పోటీ ఇచ్చినా ఈసారి వారిపై విజయం సాధించేందుకు టీమిండియా ప్రత్యేక వ్యూహాలతో ముందుకు వెళుతోంది.
లీగ్ దశలో న్యూజిలాండ్‌ను ఓడించిన భారత్, అదే జోష్‌తో ఫైనల్‌లోనూ సత్తాచాటాలని లక్ష్యంగా పెట్టుకుంది.
Details
అద్భుత ఫామ్ లో టీమిండియా ఆటగాళ్లు
ఈ మెగా టోర్నీలో భారత జట్టు దుబాయ్‌లోనే మ్యాచ్‌లు ఆడటం తమకు అనుకూలంగా మారనుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
అయితే న్యూజిలాండ్‌కు అక్కడి పిచ్, వాతావరణ పరిస్థితులు కొత్తగా ఉండటం ఒక ప్రధానమైన అంశం.
రెండు జట్ల బలబలాలను పరిశీలిస్తే సమానంగా కనిపిస్తున్నా ప్రస్తుత ఫామ్ పరంగా చూస్తే టీమిండియా కివీస్ కంటే మెరుగ్గా ఉంది.
బ్యాటింగ్ విభాగంలో విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ, శుభ్ మన్ గిల్, హార్దిక్ పాండ్యా వంటి ఆటగాళ్లు కీలకంగా నిలవనున్నారు.
వారిలో ఏ ఇద్దరు నిలదొక్కుకున్నా మ్యాచ్ దిశ మారిపోవడం ఖాయం.
Details
హాట్ ఫెవరేట్ గా టీమిండియా
ఇక న్యూజిలాండ్ విషయానికి వస్తే, రచిన్ రవీంద్ర, కెయిన్ విలియమ్సన్ అద్భుత ఫామ్‌లో ఉన్నారు.
కానీ ప్రధాన బౌలర్ మాట్ హెన్రీ గాయపడటం ఆ జట్టుకు ఎదురుదెబ్బగా మారనుంది.
మ్యాచ్ రోజు అదృష్టం ఎవరినే ఆశీర్వదిస్తుందనేది ఆసక్తికరంగా మారింది, కానీ ప్రస్తుత ఫామ్ ప్రకారం టీమిండియా స్వల్ప ఆధిక్యంలో ఉందని చెప్పొచ్చు.