Loading...
Donald Trump: ఫిఫా ఫైనల్‌పై ట్రంప్ ముద్ర.. విజేతకు ట్రోఫీ అందించనున్న అమెరికా అధ్యక్షుడు
ఫిఫా ఫైనల్‌పై ట్రంప్ ముద్ర.. విజేతకు ట్రోఫీ అందించనున్న అమెరికా అధ్యక్షుడు

Donald Trump: ఫిఫా ఫైనల్‌పై ట్రంప్ ముద్ర.. విజేతకు ట్రోఫీ అందించనున్న అమెరికా అధ్యక్షుడు

వ్రాసిన వారు Moogati Shabari
Jul 17, 2026
02:18 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రతిష్ఠాత్మక ఫిఫా ప్రపంచకప్ 2026 ఫైనల్ మ్యాచ్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హాజరుకానున్నారు. న్యూజెర్సీలోని మెట్‌లైఫ్ స్టేడియంలో ఎల్లుండి జరగనున్న తుది పోరులో విజేతగా నిలిచిన జట్టుకు ట్రంప్ ట్రోఫీని అందించనున్నారు. ఫిఫా అధ్యక్షుడు జియాని ఇన్ఫాంటినోతో కలిసి ట్రంప్ ఈ కార్యక్రమంలో పాల్గొంటారని వైట్ హౌస్, ఫిఫా వర్గాలు అధికారికంగా వెల్లడించాయి. స్పెయిన్, అర్జెంటీనా జట్ల మధ్య జరగనున్న ఈ ఫైనల్ మ్యాచ్‌కు ట్రంప్ హాజరు కావడం ఇప్పుడు ఆసక్తిని రేకెత్తిస్తోంది. వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లెవిట్ మాట్లాడుతూ.. "ప్రపంచ స్థాయి క్రీడా కార్యక్రమాలను నిర్వహించడంలో అమెరికా సామర్థ్యాన్ని ఈ టోర్నమెంట్ మరోసారి చాటిచెప్పింది.

వివరాలు

ఈసారి కూడా అదే సంప్రదాయం..

ఆదివారం జరగనున్న ఫైనల్ మ్యాచ్ కోసం అధ్యక్షుడు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు" అని తెలిపారు.

అమెరికా, కెనడా, మెక్సికో సంయుక్తంగా ఈసారి ఫిఫా వరల్డ్ కప్‌కు ఆతిథ్యం ఇస్తున్నప్పటికీ.. ట్రంప్ ఇప్పటివరకు ఒక్క మ్యాచ్‌ను కూడా ప్రత్యక్షంగా వీక్షించలేదు.

దీంతో ఫైనల్ మ్యాచ్‌కు ఆయన రాకపై ప్రత్యేక ఆసక్తి నెలకొంది. ఆతిథ్య దేశాధినేత, ఫిఫా అధ్యక్షుడితో కలిసి ట్రోఫీని అందించడం అనేది చాలా కాలంగా కొనసాగుతున్న సంప్రదాయమని ఫిఫా అధ్యక్షుడు జియాని ఇన్ఫాంటినో తెలిపారు.

"గతంలోనూ ఇదే విధానాన్ని పాటించాం. 2022లో ఖతార్ ఎమిర్, 2018లో రష్యా అధ్యక్షుడు ట్రోఫీ ప్రదాన కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈసారి కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తాం" అని ఆయన స్విస్ మీడియాతో పేర్కొన్నారు.

వివరాలు

నిరసనల రూపంలో వ్యతిరేకత..

ట్రంప్, ఇన్ఫాంటినో మధ్య చాలా కాలంగా సన్నిహిత సంబంధాలు కొనసాగుతున్నాయి.

2025 డిసెంబర్‌లో జరిగిన ఫిఫా టోర్నమెంట్ డ్రా కార్యక్రమంలో ట్రంప్ ఫిఫా తొలి శాంతి బహుమతిని అందుకున్నారు.

అంతకుముందు వేసవిలో మెట్‌లైఫ్ స్టేడియంలో జరిగిన క్లబ్ వరల్డ్ కప్ ఫైనల్‌లోనూ ట్రంప్ విజేతలకు ట్రోఫీ అందించారు.

అయితే ఆ సమయంలో ఆయనకు కొందరు అభిమానుల నుంచి చప్పట్లు అందగా, మరికొందరి నుంచి నిరసనల రూపంలో వ్యతిరేకత కూడా ఎదురైంది.

ఫిఫా టోర్నమెంట్‌లో ట్రంప్ ప్రమేయం కేవలం ఫైనల్ కార్యక్రమానికే పరిమితం కాలేదు.

రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్‌కు ముందు అమెరికా ఆటగాడు ఫోలరిన్ బలోగన్‌పై విధించిన రెడ్ కార్డ్ నిషేధాన్ని పునఃపరిశీలించాలని ట్రంప్ స్వయంగా ఇన్ఫాంటినోను కోరినట్లు వార్తలు వచ్చాయి.

ADVERTISEMENT

వివరాలు

రాజకీయ జోక్యం జరిగిందంటూ పెద్ద ఎత్తున విమర్శలు..

ఆ తర్వాత ఫిఫా ఆ నిషేధాన్ని ఎత్తివేయడంతో.. దీనిపై రాజకీయ జోక్యం జరిగిందంటూ పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.

అయితే ఆ మ్యాచ్‌లో అమెరికా జట్టు బెల్జియం చేతిలో ఓటమి పాలై టోర్నమెంట్ నుంచి నిష్క్రమించింది.

ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న స్పెయిన్-అర్జెంటీనా ఫైనల్ పోరుకు ట్రంప్ హాజరు కావడంతో ఈ మ్యాచ్ మరింత ప్రాధాన్యత సంతరించుకోనుంది.

ఫైనల్‌కు ముందు నేడు న్యూయార్క్‌లోని ట్రంప్ టవర్‌లో జరిగే ఫిఫా రిసెప్షన్ కార్యక్రమంలోనూ అమెరికా అధ్యక్షుడు పాల్గొంటారని వైట్ హౌస్ వర్గాలు వెల్లడించాయి.

ADVERTISEMENT