LOADING...
Shan Masood: 177 బంతుల్లో డబుల్ సెంచరీ.. పాక్ క్రికెట్‌లో షాన్ మసూద్ సరికొత్త రికార్డు
177 బంతుల్లో డబుల్ సెంచరీ.. పాక్ క్రికెట్‌లో షాన్ మసూద్ సరికొత్త రికార్డు

Shan Masood: 177 బంతుల్లో డబుల్ సెంచరీ.. పాక్ క్రికెట్‌లో షాన్ మసూద్ సరికొత్త రికార్డు

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 29, 2025
01:23 pm

ఈ వార్తాకథనం ఏంటి

పాకిస్థాన్ ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో షాన్ మసూద్ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. అత్యంత వేగంగా డబుల్ సెంచరీ చేసిన పాకిస్థాన్ క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు. ప్రెసిడెంట్స్ కప్ డిపార్ట్‌మెంటల్ టోర్నీలో సూయి నార్తర్న్ గ్యాస్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తూ మసూద్ కేవలం 177 బంతుల్లోనే డబుల్ సెంచరీ పూర్తి చేశాడు. ఈ ఘనతతో మూడు దశాబ్దాలుగా కొనసాగుతున్న ఇంజమాముల్ హక్ రికార్డును షాన్ మసూద్ అధిగమించాడు. 1992లో ఇంగ్లండ్ టూర్ సందర్భంగా ఓ ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లో ఇంజమామ్ 188 బంతుల్లో డబుల్ సెంచరీ చేసి అప్పట్లో రికార్డు నెలకొల్పాడు.

Details

గత రికార్డుకు బద్దలు

ఇప్పుడు ఆ రికార్డును పాక్ టెస్టు కెప్టెన్ అయిన షాన్ మసూద్ బద్దలు కొట్టడం విశేషం. ఇదిలా ఉంటే, పాకిస్థాన్ గడ్డపై డబుల్ సెంచరీ చేసిన విదేశీ క్రికెటర్ల జాబితాలో భారత బ్యాటర్ వీరేంద్ర సెహ్వాగ్ పేరు కూడా ఉంది. 2006లో లాహోర్ వేదికగా జరిగిన టెస్టు మ్యాచ్‌లో సెహ్వాగ్ కేవలం 182 బంతుల్లోనే డబుల్ సెంచరీ బాదిన సంగతి తెలిసిందే. షాన్ మసూద్ సాధించిన ఈ రికార్డు పాకిస్థాన్ దేశవాళీ క్రికెట్‌లోనే కాదు, అంతర్జాతీయంగా కూడా విశేష చర్చకు దారి తీస్తోంది.

Advertisement