NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / వెస్టిండీస్ వర్సెస్ టీమిండియా: మూడో వన్డేలో టీమ్ కూర్పుపై ద్రావిడ్ కీలక వ్యాఖ్యలు
    తదుపరి వార్తా కథనం
    వెస్టిండీస్ వర్సెస్ టీమిండియా: మూడో వన్డేలో టీమ్ కూర్పుపై ద్రావిడ్ కీలక వ్యాఖ్యలు
    మూడో వన్డేలో టీమ్ కూర్పుపై ద్రావిడ్ కీలక వ్యాఖ్యలు

    వెస్టిండీస్ వర్సెస్ టీమిండియా: మూడో వన్డేలో టీమ్ కూర్పుపై ద్రావిడ్ కీలక వ్యాఖ్యలు

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Jul 31, 2023
    01:12 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    వెస్టిండీస్‌తో రెండో వన్డేలో స్టార్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రిజర్వ్ బెంచ్‌లో కూర్చున్నారు. హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్, కెప్టెన్ రోహిత్ శర్మ చేసిన ప్రయోగం విఫలమైంది.

    ఈ నేపథ్యంలో టీమిండియా జట్టు ఎంపికలో రూపొందించిన వ్యూహాన్ని ఆయన వివరించారు.

    జులై 30, ఆదివారం కరీబియన్ గడ్డలోని బార్బడోస్‌ పరిధి కెన్సింగ్టన్ ఓవల్‌లో వెస్టిండీస్‌తో జరిగిన రెండో వన్డేలో భారత్ చిత్తుగా ఓటమిపాలైంది. దీంతో సిరీస్‌లో తొలి మ్యాచ్ భారత్ గెలవగా, రెండోది ఆతిథ్య జట్టు గెలిచింది.

    ఇక సిరీస్ ఎవరిదో తేల్చేందుకు కీలకమైన మూడో వన్డేలో భారత జట్టు టీమ్ కూర్పుపై టీమ్ మేనేజ్ మెంట్ ఏం నిర్ణయం తీసుకోనుందని క్రికెట్ ఫ్యాన్స్ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.

    DETAILS

    కేవలం ఒక మ్యాచ్, ఒక సిరీస్ గురించే ఆందోళన చెందకూడదు : రాహుల్ ద్రావిడ్

    రెండో మ్యాచ్ ఓటమి తర్వాత ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ స్పందించారు. రోహిత్, విరాట్‌లకు విశ్రాంతినిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని ఆయన సమర్థించుకున్నారు.

    ప్రపంచకప్, ఆసియా కప్ లాంటి భారీ టోర్నీలున్న నేపథ్యంలోనే రానున్న మ్యాచ్‌లకూ జట్టు ఎంపికలో రెండో వన్డే వ్యూహాన్నే పాటించనున్నట్లు చెప్పుకొచ్చారు.

    మెగా టోర్నీల రాక ముందు కేవలం ఒక మ్యాచ్, ఒక సిరీస్ గురించే ఆందోళన చెందకూడదన్నారు. అలా చేస్తే అది పొరపాటే అవుతుందన్నారు. మరోవైపు కీలక మూడో వన్డే కోసం రోహిత్, విరాట్ తిరిగి జట్టులోకి వస్తారని అంతా భావిస్తున్నారు.

    వన్డేల్లో వారు,తాము పరీక్షించబడతామని స్టాండ్ ఇన్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా చెప్పుకొచ్చారు. ఇప్పుడు సిరీస్ 1-1తో ఉందని, వచ్చే మ్యాచ్ ప్రేక్షకులతో పాటు ఆటగాళ్లకూ ఉత్తేజాన్నిస్తుందన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    క్రికెట్
    టీమిండియా
    వెస్టిండీస్
    రాహుల్ ద్రావిడ్

    తాజా

    Gold Rate: తెలుగు రాష్ట్రాల్లో పసిడి పరుగులు.. రూ. 99 వేలకి చేరువ! బంగారం
    Pakistan: భారత కార్యక్రమాలకు పాకిస్థాన్ అభ్యంతరం.. సున్నితంగా తిరస్కరించిన మలేషియా మలేషియా
    Ukraine-Russia: ఏప్రిల్ 2026 నాటికి ఉక్రెయిన్‌కు 100,000 డ్రోన్‌లు: బ్రిటన్  బ్రిటన్
    Kannappa : భీమవరంలో కన్నప్ప ప్రీ రిలీజ్ ఈవెంట్‌.. జూన్ 22న గ్రాండ్‌గా! మంచు విష్ణు

    క్రికెట్

    వన్డే వరల్డ్ కప్ ముందు కీలక నిర్ణయం.. టీమిండియా చీఫ్ సెలక్టర్‌గా అజిత్ అగార్కర్ టీమిండియా
    టీమిండియా మాజీ ప్లేయర్‌కు తప్పిన పెను ప్రమాదం టీమిండియా
    ముగ్గురు భారత ఆటగాళ్లను వదిలేయనున్న లక్నో సూపర్ జెయింట్స్! లక్నో సూపర్‌జెయింట్స్
    టీమిండియాతో టెస్టు సిరీస్.. స్పెషల్ ఫోకస్ పెట్టిన విండీస్! వెస్టిండీస్

    టీమిండియా

    దవడ పగిలినా వికెట్ తీశానని నా భార్యకు ఫోన్ చేశా.. తాను నమ్మలేదు : అనిల్ కుంబ్లే అనిల్ కుంబ్లే
    IND VS WI: భారత స్పిన్ దెబ్బకు విండీస్ విలవిల.. ఐదు వికెట్లతో చెలరేగిన అశ్విన్ వెస్టిండీస్
    మూడో టీ20ల్లో విజయం సాధించిన బంగ్లాదేశ్.. టీ20సిరీస్ టీమిండియా సొంతం బంగ్లాదేశ్
    Ind vs Wi: సెంచరీలు బాదేసిన టీమిండియా ఓపెనర్లు.. భారీ స్కోరు దిశగా భారత్ రోహిత్ శర్మ

    వెస్టిండీస్

    SA vs WI: తొలి టెస్టులో ఐదు వికెట్ల తీసి సత్తా చాటిన అల్జారీ జోసెఫ్ క్రికెట్
    SA vs WI: రసవత్తరంగా సౌతాఫ్రికా, వెస్టిండీస్ టెస్టు మ్యాచ్ క్రికెట్
    SA vs WI: అరుదైన మైలురాయిని అందుకున్న జాసన్ హోల్డర్ క్రికెట్
    SA vs WI : సౌతాఫ్రికాపై ప్రతీకారం తీర్చుకోవడానికి వెస్టిండీస్ సిద్ధం క్రికెట్

    రాహుల్ ద్రావిడ్

    ది వాల్ బ్యాటింగ్ సీక్రెట్ ఇదే.. మాజీ ప్లేయర్ వెల్లడి క్రికెట్
    రాహుల్ ద్రవిడ్‌కు అనారోగ్యం, చికత్స కోసం బెంగళూరు క్రికెట్
    విరాట్ స్థానంపై ద్రవిడ్ సూటిగా సమాధానాలు క్రికెట్
    జహీర్‌ఖాన్ లాంటి లెఫ్ట్ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ టీమిండియాకు అవసరం క్రికెట్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025