
WI vs IND: రోహిత్, కోహ్లీలకు విశ్రాంతి.. వివరణ ఇచ్చిన రాహుల్ ద్రావిడ్
ఈ వార్తాకథనం ఏంటి
టీమిండియా వెస్టిండీస్ పర్యటనలో ఉంది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా మొదటి వన్డేలో టీమిండియా విజయం సాధించింది. అయితే శనివారం జరిగిన రెండో వన్డేలో భారత జట్టు ఓటమిపాలైంది.
ఈ నేపథ్యంలో టీమిండియా హెడ్ కోచ్ పై రాహుల్ ద్రావిడ్ పై విమర్శలు వెలువెత్తుతున్నాయి. ప్రస్తుతం ద్రావిడ్‌ను హెడ్ కోచ్ నుంచి తొలగించాలని #SackDravid అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది.
రెండో వన్డేలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ విశ్రాంతి ఇవ్వడం వల్లే టీమిండియా ఓడిపోయిందంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. తాజాగా ఈ వ్యవహారంపై రాహుల్ ద్రావిడ్ స్పందించాడు.
త్వరలో ఆసియా కప్, ఆ తర్వాత జరగనున్న ప్రపంచ కప్ టోర్నీలను దృష్టిలో ఉంచుకొని ప్రయోగాలు చేసినట్లు అతను వెల్లడించారు.
Details
సంజుశాంసన్, అక్షర పటేల్ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయారు
ఆసియా కప్ కు ముందు రెండు మ్యాచులు మాత్రమే మిగిలి ఉన్నాయని, దీంతో రిజర్వ్ స్థానాల్లో ఉన్న ప్లేయర్స్ తన ఆటను నిరూపించుకోవడానికి ఇదే మంచి అవకాశంగా భావించామని, ఒకవేళ రోహిత్, విరాట్ కోహ్లీ ఆడి ఉంటే తమకు కొన్ని సమాధానాలు లభించేవి కావని ద్రావిడ్ చెప్పుకొచ్చాడు.
రోహిత్, కోహ్లీ స్థానంలో రెండో వన్డేలో సంజు శాంసన్, అక్షర్ పటేల్ కు అవకాశం కల్పించినా వారు నిరూపించుకోలేక పోయారు.
రెండో వన్డేలో కోహ్లీ, రోహిత్ లేకుండా బరిలోకి దిగిన భారత జట్టు కేవలం 181 పరుగులకే ఆలౌటైంది. ఈ లక్ష్యాన్ని విండీస్ జట్టు 36.4 ఓవర్లలోనే చేధించింది.