NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / WI vs IND: రెండో వన్డేలో భారత్‌పై వెస్టిండీస్ ఘన విజయం
    తదుపరి వార్తా కథనం
    WI vs IND: రెండో వన్డేలో భారత్‌పై వెస్టిండీస్ ఘన విజయం
    రెండో వన్డేలో భారత్‌పై వెస్టిండీస్ ఘన విజయం

    WI vs IND: రెండో వన్డేలో భారత్‌పై వెస్టిండీస్ ఘన విజయం

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Jul 30, 2023
    10:24 am

    ఈ వార్తాకథనం ఏంటి

    వెస్టిండీస్ పర్యటనలో ఉన్న టీమిండియాకు మొదటి ఎదురుదెబ్బ తగిలింది. శనివారం జరిగిన రెండో వన్డేల్లో టీమిండియాపై వెస్టిండీస్ ఘన విజయం సాధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను 1-1తో సమం అయింది.

    విండీస్ బౌలర్ల ధాటికి మొదటి బ్యాటింగ్ చేసిన భారత జట్టు 181 పరుగులకే ఆలౌటైంది. ఓపెనర్లు ఇషాన్ కిషన్ 55, శుభ్‌మన్ గిల్ 34 పరుగులతో ఫర్వాలేదనిపించారు.

    మిగతా బ్యాటర్లు చేతులెత్తేయడంతో భారత్ తక్కువ పరుగులే చేయగలిగింది.

    మొదటి వికెట్‌కు ఓపెనర్లు 90 పరుగులతో అదిరే ఆరంభాన్ని అందించారు. మిగతా 91 పరుగుల వ్యవధిలో టీమిండియా 10 వికెట్లనూ కోల్పోవడం విశేషం. విండీస్ బౌలర్లలో షెఫర్డ్ 3, మోతీ 3, జోసెఫ్ 2, సీల్స్, కరియా ఒక్కో వికెట్ తీశారు.

    Details

    హాఫ్ సెంచరీతో రాణించిన హోప్

    అక్షర్‌ పటేల్‌ (1), సంజు శాంసన్‌ (9), కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్య (7) ఈ మ్యాచులో పూర్తిగా నిరాశపరిచారు.

    లక్ష్య చేధనకు వెస్టిండీస్ 36.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించింది. విండీస్ బ్యాటర్లు షై హోప్ 63, కార్టీ 48 పరుగులతో చివరి క్రీజులో ఉండి విండీస్ జట్టుకు విజయాన్ని అందించాడు.

    ఓపెనర్ కైలే మేయర్ 36 పరుగులతో రాణించాడు. హోప్ 70 బంతుల్లో హాఫ్ సెంచరీ బాదాడు.

    టీమిండియా బౌలర్లలో శార్దుల్ ఠాకూర్ 2, హార్ధిక్ పాండ్యా, ఉమ్రాన్ మాలిక్, కుల్దీప్ యాదవ్ తలో ఓ వికెట్ తీశారు. ఇక మూడో వన్డే ఆగస్టు 1న జరగనుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    వెస్టిండీస్
    టీమిండియా

    తాజా

    Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్ రిలీజ్.. కిరణ్ అబ్బవరం
    Rajamouli: గెలుపు ఎవరిదైనా.. ఓటమి గుండెల్లో నిలిచిపోతుంది.. రాజమౌళి ట్వీట్ వైరల్ రాజమౌళి
    PM Modi: జూన్ 04న మంత్రులతో ప్రధాని మోదీ భేటీ.. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇదే మొదటి సమావేశం.. నరేంద్ర మోదీ
    IPL Prize Money: ఐపీఎల్ ఫైనల్ గెలిచిన జట్టుకు భారీగా నగదు.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్ హోల్డర్లకు ఎంత తెలుసా? ఐపీఎల్

    వెస్టిండీస్

    వెస్టిండీస్ జట్టులోకి రీ ఎంట్రీ ఇచ్చిన గాబ్రియెల్ క్రికెట్
    SA vs WI: తొలి టెస్టులో ఐదు వికెట్ల తీసి సత్తా చాటిన అల్జారీ జోసెఫ్ క్రికెట్
    SA vs WI: రసవత్తరంగా సౌతాఫ్రికా, వెస్టిండీస్ టెస్టు మ్యాచ్ క్రికెట్
    SA vs WI: అరుదైన మైలురాయిని అందుకున్న జాసన్ హోల్డర్ క్రికెట్

    టీమిండియా

    టీమిండియాను ఓడించడానికి సిద్ధం : విండీస్ కెప్టెన్ వెస్టిండీస్
    దవడ పగిలినా వికెట్ తీశానని నా భార్యకు ఫోన్ చేశా.. తాను నమ్మలేదు : అనిల్ కుంబ్లే అనిల్ కుంబ్లే
    IND VS WI: భారత స్పిన్ దెబ్బకు విండీస్ విలవిల.. ఐదు వికెట్లతో చెలరేగిన అశ్విన్ వెస్టిండీస్
    మూడో టీ20ల్లో విజయం సాధించిన బంగ్లాదేశ్.. టీ20సిరీస్ టీమిండియా సొంతం బంగ్లాదేశ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025