LOADING...
T20 World Cup 2026: విమర్శల మధ్య రాణించిన దూబే… టీమిండియా విజయాల్లో కీలక పాత్ర
విమర్శల మధ్య రాణించిన దూబే… టీమిండియా విజయాల్లో కీలక పాత్ర

T20 World Cup 2026: విమర్శల మధ్య రాణించిన దూబే… టీమిండియా విజయాల్లో కీలక పాత్ర

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 03, 2026
03:59 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇటీవలి కాలంలో టీమిండియా ప్లేయర్ శివమ్‌ దూబే పేరు ఎక్కువగా చర్చల్లో నిలుస్తోంది. జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో అధిక పరుగులు ఇవ్వడం, ముఖ్యంగా నోబాల్స్‌ వేయడం కారణంగా అతడిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. సోషల్‌ మీడియాలో ట్రోలింగ్‌ కూడా ఎదుర్కొన్నాడు. ఆ తప్పులను సమర్థించే అవకాశం లేకపోయినా, ఈ టీ20 ప్రపంచకప్‌లో బ్యాటుతో అతడు చూపించిన ప్రదర్శన మాత్రం ప్రశంసనీయమే. ఒకప్పుడు దూబేను ఏకపాత్రాభినయ ఆటగాడిగా భావించేవారు. స్పిన్‌ బౌలర్లపై భారీ సిక్సులు కొట్టగల సామర్థ్యం ఉన్నా, వేగవంతమైన పేసర్ల ముందు ఇబ్బందులు పడేవాడు. వేగం ఎదురైతే ఒత్తిడికి లోనై దూకుడుగా ఆడలేకపోవడం అతడి బలహీనతగా చెప్పేవారు. అయితే ఇప్పుడు పరిస్థితి మారింది.

Details

ఒత్తిడిని తట్టుకునే సామర్థ్యం ఉంది

ఇది ఎంఎస్ ధోని ప్రభావమా? లేక చైన్నై సూపర్ కింగ్స్‌లో పొందిన అనుభవమా? ఏదైనా కావొచ్చు... కానీ ప్రస్తుత దూబే పూర్తి స్థాయి టీ20 ఆటగాడిగా రూపాంతరం చెందాడు. ఆసియా కప్ ఫైనల్లో పాకిస్తాన్‌పై బౌలింగ్‌లో కీలక సమయంలో బాధ్యత తీసుకుని రాణించిన సందర్భం అతడి మానసిక ధైర్యానికి నిదర్శనం. ఒత్తిడిని తట్టుకునే సామర్థ్యం ఉందని అప్పుడే స్పష్టమైంది. అదే విషయం వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో మరోసారి కనిపించింది. ఆ మ్యాచ్‌లో దూబే క్రీజ్‌లోకి వచ్చేసరికి భారత్‌కు ఇంకా 10 బంతుల్లో 17 పరుగులు అవసరం.

Details

రాణిస్తున్న దూబే

రెండు డాట్ బాల్స్‌ పడితేనే ఒత్తిడి పెరిగే పరిస్థితి. బౌలింగ్‌లో వెస్టిండీస్‌ పేసర్ షమర్ జోసెఫ్ ఉన్నాడు. స్పష్టంగా అది దూబేకు కఠిన పరీక్ష. అయినప్పటికీ ఆ ఒత్తిడిని అధిగమించి జట్టును విజయ దిశగా నడిపించడం అతడి ఆటలో వచ్చిన పరిణతి, నమ్మకం ఎంత పెరిగిందో చూపించింది. విమర్శల నడుమ ఎదిగిన దూబే... ఇప్పుడు జట్టుకు కీలక సమయాల్లో ఆధారంగా నిలుస్తున్నాడు. ఇదే అతడి నిజమైన ఎదుగుదలని చెప్పొచ్చు.

Advertisement