Page Loader
Hardik Pandya: టీమ్ ఇండియాకు భారీ షాక్.. ప్రపంచ కప్ మొత్తానికి హార్దిక్ పాండ్యా దూరం 
టీమ్ ఇండియాకు భారీ షాక్.. ప్రపంచ కప్ మొత్తానికి హార్దిక్ పాండ్యా దూరం

Hardik Pandya: టీమ్ ఇండియాకు భారీ షాక్.. ప్రపంచ కప్ మొత్తానికి హార్దిక్ పాండ్యా దూరం 

వ్రాసిన వారు Stalin
Nov 04, 2023
09:47 am

ఈ వార్తాకథనం ఏంటి

Hardik Pandya Ruled Out: టీమ్ ఇండియాకు భారీ షాక్ తగిలింది. టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా ప్రపంచ కప్-2023 (World Cup 2023) నుంచి పూర్తిగా నిష్క్రమించాడు. పాండ్యా గాయం నుంచి కోలుకొని, సెమీఫైనల్‌కు తిరిగి వస్తాడని అంతా ఊహించారు. కానీ గాయం ఇప్పట్లో తగ్గేలా కనపడకపోవడంతో అతను టోర్నీ మొత్తానికి దూరమయ్యే పరిస్థితులు ఏర్పడ్డాయి. చీలమండ గాయం కారణంగా అతను టోర్నీ మొత్తానికి దూరమైనట్లు బీసీసీఐ వర్గాలు తెలిపాయి. పాండ్యా స్థానంలో ప్రసిద్ధ్ కృష్ణ జట్టులోకి వచ్చాడు. టీమిండియా సెమీ ఫైనల్‌కు ఎంపికైన నేపథ్యంలో పాండ్యా టోర్నీ నుంచి నిష్క్రమించడం భారత్‌కు పెద్ద దెబ్బే అని చెప్పాలి.

బీసీసీఐ

హార్దిక్ పాండ్యా స్థానంలో ప్రసిద్ధ్ కృష్ణ‌ భర్తీకి టెక్నికల్ కమిటీ ఆమోదం

టోర్నమెంట్ ఈవెంట్ టెక్నికల్ కమిటీ కూడా హార్దిక్ పాండ్యా స్థానంలో ప్రసిద్ధ్ కృష్ణ‌ను భర్తీ చేయడానికి శనివారం అనుమతిచ్చింది. కోల్‌కతాలోని ఐకానిక్ ఈడెన్ గార్డెన్స్‌లో ఆదివారం దక్షిణాఫ్రికాతో జరిగే మ్యాచ్‌కు కృష్ణ అందుబాటులో ఉంటాడు. పూణె వేదికగా భారత్-బంగ్లాదేశ్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో పాండ్యా గాయపడ్డాడు. పుణెలో జరిగిన మ్యాచ్‌లో బౌలింగ్‌లో హార్దిక్ గాయపడ్డాడు. అతని ఎడమ కాలి మడమకు గాయమైంది. ఈ కారణంగా హార్దిక్ న్యూజిలాండ్, ఇంగ్లండ్, శ్రీలంక జట్లపై ఆడలేదు. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఆ జట్టు అగ్రస్థానంలో ఉంది. టీమిండియా ప్రపంచ కప్ టోర్నీలో 7 మ్యాచ్‌లు ఆడి అన్నింటినీ గెలిచింది. 14 పాయింట్లతో టేబుల్‌లో భారత్ టాప్‌లో ఉంది.