Duleep Trophy final:హాఫ్ సెంచరీతో రాణించిన హనుమ విహారి
2023 దులీప్ ట్రోఫీ ఫైనల్‌లో సౌత్ జోన్ కెప్టెన్ హనుమ విహారి హాప్ సెంచరీతో సత్తా చాటాడు. వెస్ట్ జోన్ జట్టుపై 130 బంతుల్లో 63 పరుగులు చేశాడు. యువ ఆటగాడు తిలక్ వర్మతో కలిసి మూడో వికెట్‌కు 79 పరుగులు జోడించడం విశేషం. వెలుతురు, వర్షం కారణంగా ఆటను త్వరగా ముగించడంతో సౌత్ జోన్ 60 ఓవర్లలో 170/6 స్కోరు చేసింది. సౌత్ జోన్ ఆరభంలోనే (15/1) రవికుమార్ సమర్థ్ వికెట్ ను కోల్పోయింది. 42 పరుగుల వద్ద మయాంక్ అగర్వాల్ (28) నిరాశచపరిచాడు. తర్వాత తిలక్ వర్మ, హనుమ విహారి జట్టును అదుకొనే ప్రయత్నం చేశాడు. వీరిద్దరూ కలిసి స్కోరును 100 పరుగుల మార్క్‌ను దాటించారు.
ఎఫ్‌సి క్రికెట్‌లో 8706 పరుగులు చేసిన హనుమ విహారి
రెండో సెషన్‌లో మూడు వికెట్లు వేగంగా పడ్డాయి. అనంతరం షామ్స్ ములానీ బౌలింగ్‌లో హనుమ విహారి ఔట్ అయ్యాడు. వెస్ట్ జోన్ తరుపున ములాని (2/19), చింతన్ గజ (2/27) అద్భుతంగా రాణించారు. విహారి ఎఫ్‌సి క్రికెట్‌లో ఇప్పటివరకూ 8,706 పరుగులు చేశాడు. ఇందులో 23 సెంచరీలు, 46 అర్ధ సెంచరీలను బాదాడు. ఇక టీమిండియా తరుపున విహారి 33.56 సగటుతో 839 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, మూడు అర్ధసెంచరీలున్నాయి