Mohammed Siraj: చరిత్రను సృష్టించిన మహ్మద్ సిరాజ్.. 36 ఏళ్ల తర్వాత తొలిసారి!
ఈ వార్తాకథనం ఏంటి
భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య రెండో టెస్టు మ్యాచ్ బుధవారం ప్రారంభమైంది. టాస్ గెలిచిన సౌతాఫ్రికా మొదట బ్యాటింగ్ ఎంచుకుంది.
తొలి సెషన్‌లో భారత్‌కు బౌలర్లు మంచి శుభారంభాన్ని అందించారు.
ముఖ్యంగా మహ్మద్ సిరాజ్(Mohammed Siraj) దక్షిణాఫ్రికా స్టార్ బ్యాటర్లను హడలెత్తించాడు.
తొలి సెషన్‌లో ఏడు ఓవర్లు బౌలింగ్ చేసి 3 వికెట్ల తీయగా, ఆ తర్వాత ఎడిషన్‌లో 3 వికెట్లు తీసుకున్నాడు.
అతనికి తోడుగా జస్ప్రిత్ బుమ్రా, ముకేష్ కుమార్ తలా రెండు వికెట్లు తీయడంతో దక్షిణాఫ్రికా 23.2 ఓవర్లలోనే 55 పరుగులకు ఆలౌటౌంది.
Details
అరుదైన మైలురాయిని చేరుకున్న మహ్మద్ సిరాజ్
ఈ క్రమంలో మహ్మద్ సిరాజ్ కొత్త చరిత్రను సృష్టించాడు. తొలి రోజు ఆటలో లంచ్ విరామం లోపు అయిదు వికెట్లు తీసిన రెండో భారత బౌలర్‌గా రికార్డుకెక్కాడు.
గతంలో సిరాజ్ కంటే ముందు 1987లో భారత్ తరుపున మణిందర్ సింగ్ ఈ ఆరుదైన ఫీట్‌ను సాధించాడు.
పాకిస్థాన్‌తో జరిగిన ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో మణిందర్ సింగ్ ఏడు వికెట్లు తీశారు. ఇక 36 ఏళ్ల తర్వాత ఈ అరుదైన జాబితాలో సిరాజ్ చేరడం విశేషం.
ఇదిలా ఉండగా.. భారత్ తో జరిగిన మ్యాచులో దక్షిణాఫ్రికాకి ఇదే అత్యల్ప స్కోరు కావడం గమనార్హం.
గతంలో 2015లో జరిగిన టెస్టులో సౌతాఫ్రికాను భారత్ 79 పరుగులకే ఆలౌట్ చేసిన విషయం తెలిసిందే.