తదుపరి వార్తా కథనం

U-19 Asia Cup 2023: అద్భుతం.. కాళ్లతో క్యాచ్ పట్టి ఔట్ చేశాడు
వ్రాసిన వారు
Jayachandra Akuri
Dec 11, 2023
04:05 pm
ఈ వార్తాకథనం ఏంటి
ఆసియా కప్ అండర్-19 (Asia Cup U-19)లో విచిత్రకరమైన ఘటన చోటు చేసుకుంది. పాక్ వికెట్ కీపర్ సాద్ బేగ్ ఎవరికీ నమ్మశక్యం కానీ రీతిలో కాళ్లతో క్యాచ్ పట్టి ఔరా అనిపించాడు.
దుబాయ్ వేదికగా నిన్న భారత్, పాకిస్థాన్(IND-PAK) మధ్య లీగ్ మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే.
ఈ మ్యాచులో భారత్ మొదట బ్యాటింగ్ చేయగా ఇన్నింగ్స్ 32 ఓవర్లలో పాక్ స్పిన్నర్ అరాఫత్ బౌలింగ్ చేశాడు.
ఆ బంతిని ఓపెనర్ ఆదర్శ్ స్వీప్ ఆడేందుకు ప్రయత్నించాడు.
అది కాస్త బ్యాట్ ఎడ్జ్ తీసుకొని మిస్ అవ్వగా పాక్ వికెట్ కీపర్ సాద్ బేగ్ రెండు కాళ్ల క్యాచ్ అందుకున్నాడు.
ప్యాడ్ల మధ్యలో బాల్ ఇరుక్కోగా దాన్ని అంపైర్ ఔట్‌గా ప్రకటించాడు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
క్యాచ్ పడుతున్న వీడియో
Captain Saad Baig with His New Catching Skills 🔥❤️😀#indvspak2023 #pakvsind#PakistanFutureStars #PakvIND #PAKvAUSpic.twitter.com/asj4NW9l8m
— Ha55an 🇵🇰 (@sheikh_dot_com) December 10, 2023