నెదర్లాండ్స్ తరుపున ఆడనని స్పష్టం చేసిన డచ్ బాక్సర్
WWCH 2023లో నెదర్లాండ్స్ తరుపున ఆడడం లేదని డచ్ బాక్సర్ మేగాన్ డి క్లెర్ స్పష్టం చేసింది. అయితే తాను ఇంటర్నేషనల్ బాక్సింగ్ అసోసియేషన్ టోర్నమెంట్‌లో పాల్గొనాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఉక్రెయిన్‌పై జరుగుతున్న యుద్ధం కారణంగా రష్యా, బెలారస్ రెండూ అనేక దేశాల నుండి విమర్శలను ఎదుర్కొంటున్నాయి. అయితే భారత బాక్సింగ్ సమాఖ్య (బిఎఫ్‌ఐ) ఇరు దేశాల అథ్లెట్లను పోటీల్లో పాల్గొనేందుకు అనుమతించడంపై పలువురిని అగ్రహానికి గురి చేసింది భారత్ నిర్ణయం కారణంగా అమెరికా, బ్రిటన్, ఐర్లాండ్,కెనడా, స్వీడన్, పోలాండ్, నెదర్లాండ్స్, చెక్ రిపబ్లిక్, ఉక్రెయిన్, స్విట్జర్లాండ్, నార్వే సహా 11 దేశాలు టోర్నీకి దూరమయ్యాయి. తాష్కెంట్‌లో జరగనున్న పురుషుల ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లలో తమ బాక్సర్లు పాల్గొనరని ఇప్పటికే చాలా దేశాలు ప్రకటించాయి.
అధికారులపై క్రమశిక్షణా చర్యలు
శుక్రవారం డచ్ బాక్సర్ డి క్లెర్ మీడియాతో మాట్లాడింది. తాను నెదర్లాండ్స్ కోసం ఆడడం లేదని, తాను రాజకీయాలు చేయకపోవడం వల్లే ఇక్కడ ఉన్నానని స్పష్టం చేసింది. క్లెర్ మార్చి 15న బాక్సింగ్ ప్రారంభ వేడుకల్లో IBA జెండాను పట్టుకుది. దీనిపై డచ్ ఫెడరేషన్ నుండి ఏదైనా ఆంక్షలు విధిస్తారా అని ఆమెను అడగ్గా.. తనకేమీ తెలియని డి క్లెర్ వెల్లడించారు. ఇంటర్నేషన్ బాక్సింగ్ ఆసోసియేషన్ మహిళల, పురుషుల ఛాంపియన్ షిప్ లపై బహిష్కరణకు ప్రేరిపించిన ఐదుగురు అధికారులపై ఇప్పటికే క్రమశిక్షణా చర్యలను తీసుకున్నారు.