Page Loader
స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్ తొలి 'పంచ్' అదుర్స్
50కేజీల విభాగంలో విజయం సాధించిన నిఖత్ జరీన్

స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్ తొలి 'పంచ్' అదుర్స్

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 17, 2023
12:20 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఢిల్లీ వేదికగా జరుగుతున్న మహిళల బాక్సింగ్ వరల్డ్ ఛాంపియన్‌షిప్స్ లో తెలంగాణ స్టార్ మహిళా బాక్సర్ నిఖత్ జరీన్ శుభారంభం చేసింది. 50కేజీల విభాగంలో అజర్ బైజాన్‌కు చెందిన ఇస్మయిలోవా అనఖానిమ్‌ను చిత్తు చేసింది. దీంతో రౌండ్ ఆఫ్ 32లోకి ప్రవేశించింది. మ్యాచ్ మొదలవగానే తన పంచుల వర్షంతో ప్రత్యర్థికి నిఖత్ హడలెత్తించింది. డిఫెండింగ్‌ చాంపియన్‌ నిఖత్‌ ధాటికి ప్రత్యర్థి రింగ్‌లో నిలువలేకపోవడంతో నిర్ణీత సమయం కంటే ముందే రిఫరీ బౌట్‌ను నిలిపివేసి నిఖత్‌ను విజేతగా ప్రకటించడం విశేషం అనంతరం రెండో రౌండ్‌లో అల్జీరియాకు చెందిన టాప్ సీడ్ రౌమైసా బౌలమ్‌తో ఆమె తలపడనుంది.

నిఖత్ జరీన్

జోస్‌ మారియాను చిత్తు చేసిన సాక్షి

మహిళల బాక్సింగ్ ఈవెంట్‌లో 65 దేశాలకు చెందిన 324 మంది బాక్సర్లు పాల్గొంటున్నారు. మరోవైపు సాక్షికూడా కొలంబియాకు చెందిన జోస్‌ మారియాను 5-0తో చిత్తు చేసింది. జాస్మిన్‌ (60 కేజీలు), శృతి యాదవ్‌ (70 కేజీలు) విజయాలు సాధించారు. నుపుర్‌ షెరోన్‌ (81 కేజీల పైన) క్వార్టర్‌ఫైనల్‌కి చేరింది. ప్రిక్వార్టర్స్‌లో నుపుర్‌ 5-0తో అబయోలా (గయానా)ను ఓడించింది. గతేడాది 52 కిలోల విభాగంలో ఛాంపియన్‌గా నిలిచిన నిఖత్‌ ఈసారి 50 కిలోల విభాగంలో పోటీ పడడం గమనార్హం.