Page Loader
చాంపియన్ షిప్ విజేత నిఖత్‌ జరీన్.. పంచ్ ఆదర్స్
విజేత నిఖత జరీన్

చాంపియన్ షిప్ విజేత నిఖత్‌ జరీన్.. పంచ్ ఆదర్స్

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 26, 2022
02:44 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణ యువ సంచలనం, బాక్సర్ నిఖత జరీన్ మరోసారి తన పంచ్ పవర్ చూపింది.భోపాల్ వేదికగా జరిగిన జాతీయ మహిళల బాక్సింగ్ చాంపియన్ షిప్ లో బంగారు పతకం సాధించింది. ఈ ఏడాది ఆరంభంలో స్ట్రాంజా మెమోరియల్ టోర్నమెంట్‌లో పసిడి గెలిచిన నిఖత్.. తర్వాత ప్రపంచ చాంపియన్ షిప్ గెలిచి చరిత్ర సృష్టించింది. కామన్వెల్త్ క్రీడల్లోనూ పసిడి పతకం సొంతం చేసుకున్న నిఖత్ ఇప్పుడు జాతీయ చాంపియన్‌షిప్ గెలిచి ఔరా అనిపించింది. ఫైనల్స్ లో అనామిక(రైల్వేస్) ను 4-1 తేడాతో ఓడించి టైటిల్‌ను సొంతం చేసుకుంది. 50 కేజీల విభాగంలో పోటీ పడిన నిఖత్‌ ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. ఆరంభం నుంచే దూకుడుగా బాక్సింగ్‌ చేసింది. దీంతో అనామిక పోటీ ఇవ్వలేకపోయింది.

నిఖత జరీన్

2019 ప్రపంచ చాంపియన్ విజేతలు మంజురాణి, జ్యోతి గులియా

ఇక 75 కేజీల విభాగంలో జాతీయ మహిళల బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌ లవ్లీనా ఫైనల్ చేరుకుంది. ఆమె అరుంధతి చౌదరితో పోటీ పడనుంది. మొదట నిఖత్ జరీన్ 50 కేజీల సెమీ-ఫైనల్‌లో ఆల్ ఇండియా పోలీస్ (ఏఐపీ)కి చెందిన శ్విందర్ కౌర్‌పై 5-0తో గెలిచింది. రైల్వేస్ బాక్సర్లలో అనుపమ, శిఖ్సా, పూనమ్, శశి, అనుపమ, నుపుర్ ఫైనల్స్‌కు చేరుకున్నారు. అదే విధంగా మనీషా 4-1తో ఆర్‌ఎస్‌పిబికి చెందిన సోనియా లాథర్‌ను ఓడించింది. ప్రస్తుతం ఫైనల్‌లో హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన వినక్షితో తలపడనుంది. 2019 ప్రపంచ ఛాంపియన్‌షిప్ విజేత మంజు రాణి, 2017 ప్రపంచ యూత్ ఛాంపియన్ జ్యోతి గులియా వరుసగా 48 కిలోలు, 52 కిలోల విభాగంలో టైటిల్‌ను గెలుచుకొని సత్తాను చాటారు.