ప్రపంచ క్యాడెట్ చెస్ ఛాంపియన్‌షిప్ నుంచి వైదొలగిన భారత జట్టు
అక్టోబర్ 14 నుండి 23 వరకు ఈజిప్టులోని షర్మ్ ఎల్ షేక్‌లో జరిగే ప్రపంచ క్యాడెట్ చెస్ ఛాంపియన్‌షిప్ 2023 నుండి భారత చెస్ ప్రతినిధి బృందం వైదొలిగింది. అండర్-12, 10, 8 విభాగాల్లో జరిగే ఈ టోర్నీలో దేశం నుంచి 39 మంది క్రీడాకారులు పాల్గొనాల్సి ఉంది. ఇజ్రాయెల్- హమాస్ మధ్య గాజా స్ట్రిప్‌లో కొనసాగుతున్న పరిస్థితి, పాల్గొనేవారి వయస్సును పరిగణనలోకి తీసుకుని,తగిన చర్చల తర్వాత, ప్రపంచ క్యాడెట్ చెస్ ఛాంపియన్‌షిప్-2023లో భారత జట్టు భాగస్వామ్యాన్ని ఉపసంహరించుకోవాలని నిర్ణయించినట్లు ఆల్ ఇండియా చెస్ ఫెడరేషన్ (AICF)ఒక పత్రికా ప్రకటనలో తెలిపారు. AICF ప్రకారం, ఆటగాళ్లు, కోచ్‌లు,ఆటగాళ్లతో పాటుగా 80 మంది వ్యక్తులు టోర్నమెంట్ కోసం షర్మ్ ఎల్ షేక్‌కు వెళ్లాల్సి ఉంది.