Page Loader
సెమీఫైనల్లో వింబుల్డన్ ఛాంపియన్ ఎలెనా రిబాకినా ఓటమి
హద్దాద్ మైయా ఎలెనా రైబాకినాను ఓడించింది

సెమీఫైనల్లో వింబుల్డన్ ఛాంపియన్ ఎలెనా రిబాకినా ఓటమి

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 11, 2023
10:19 am

ఈ వార్తాకథనం ఏంటి

క్వార్టర్ ఫైనల్లో జరిగిన పోరులో ప్రస్తుత వింబుల్డన్ ఛాంపియన్ ఎలెనా రిబాకినా 2023 అబుదాబి ఓపెన్ సెమీ ఫైనల్‌లో ఓటమి పాలైంది. ఆస్ట్రేలియా ఓపెన్ 2023 లో ఫైనల్‌కు చేరిన రెబాకినా మూడు సెట్లలో ఓడిపోయి నిరాశ పరిచింది. రిబాకినాను 6-3, 3-6, 2-6తో బీట్రిజ్‌ హద్దాద్‌ మైయా ఓడించింది. అనంతరం నంబర్ వన్ సీడ్ డారియా కసత్కినాను క్విన్వెన్ జెంగ్ చిత్తు చేసింది. 2023లో రైబాకినా 8-4తో గెలుపు-ఓటమి రికార్డును కలిగి ఉంది. రైబాకినా 19 ఏస్‌లు సాధించగా.. హద్దాద్ మైయా కేవలం రెండు మాత్రమే సాధించింది. ముఖ్యంగా హద్దాద్ మైయా మొదటి సర్వ్‌లో 63శాతం, రెండో సర్వ్‌లో 87శాతం విజయంతో దూసుకెళ్లింది.

కసత్కినా

జెంగ్ చేతిలో ఓడిపోయిన కసత్కినా

సూపర్ ఫామ్‌లో ఉన్న కసత్కినా, జెంగ్ చేతిలో పరాజయం పాలైంది. కసత్కినాను 6-1, 6-2తో జంగ్ కేవలం 78 నిమిషాల్లో చిత్తు చేసింది. 2022లో టొరంటోలో ఓన్స్ జబీర్, టోక్యోలో పౌలా బడోసాపై ఓడిపోయిన తర్వాత జెంగ్ కెరీర్‌లో 10 విజయాన్ని సాధించింది. ప్రస్తుతం జెంగ్ టూర్-లెవల్ సెమీ-ఫైనల్‌కు అర్హత సాధించింది. జెంగ్ మొదటి సర్వ్‌లో 82శాతం విజయం సాధించగా, రెండోసారి 53శాతం విజయంతో ముందుకెళ్లింది. జెంగ్ నాలుగు ఏస్‌లు సాధించిగా. కసత్కినా ఒక ఎస్ మాత్రమే సంపాదించింది.