Page Loader
క్వార్టర్స్‌కు చేరుకున్న వింబుల్డన్ ఛాంపియన్ రిబాకినా
వరుస సెట్లలో ప్లిస్కోవాను ఓడించిన రైబాకినా

క్వార్టర్స్‌కు చేరుకున్న వింబుల్డన్ ఛాంపియన్ రిబాకినా

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 10, 2023
09:35 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రస్తుత వింబుల్డన్ ఛాంపియన్ ఎలెనా రిబాకినా మరోసారి చెలరేగింది. 2023 అబుదాబి ఓపెన్ క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకొని సత్తా చాటింది. రౌండ్ ఆఫ్-16 క్లాష్‌లో కరోలియా ప్లిస్కోవాపై విజయం సాధించింది. ఆస్ట్రేలియా ఓపెన్ 2023 ఫైనల్‌కు చేరిన రెబాకినా వరుస సెట్లలో ప్లిస్కోవాను మట్టి కరిపించింది. కేవలం 69 నిమిషాల్లో జరిగిన ఈ పోటీలో రైబాకినా 6-4, 6-2 తేడాతో ప్లిస్కోవాను చిత్తు చేసింది. అదే సమయంలో బార్బోరా క్రెజ్‌సికోవాపై లియుడ్మిలా సామ్సోనోవా విజయం సాధించడంతో పాటు డారియా కసత్కినా 1-6, 6-0, 6-2తో జిల్ టీచ్‌మన్‌పై గెలుపొందింది. రైబాకినా చేసిన మూడు ఏస్‌లతో పోలిస్తే ప్లిస్కోవా ఏడు ఏస్‌లు సాధించింది. రైబాకినా మొదటి సర్వ్‌లో 74శాతం, రెండో‌సర్వ్‌లో 83శాతం విజయాన్ని సాధించింది.

రైబాకినా

క్వార్టర్ ఫైనల్లోకుడెర్మెటోవాతో తలపడనున్న శాంసోనోవా

ప్లిస్కోవాపై రైబాకినా తన హెచ్2హెచ్ సంఖ్యను 3-0కి మెరుగుపరుచుకోవడం విశేషం. రైబాకినా గతంలో 2022 గ్వాడలజారా, 2020 దుబాయ్‌లో మాజీ ప్రపంచ నంబర్ వన్ ప్లిస్కోవాను ఓడించిన విషయం తెలిసిందే. 2023లో రైబాకినా 8-3తో గెలుపు-ఓటమి రికార్డును కలిగి ఉంది. అనంతరం రెండు సెట్లలో క్రెజ్‌సికోవాను ఓడించినశాంసోనోవా తన మొదటి క్వార్టర్-ఫైనల్‌కు చేరుకుంది. శాంసోనోవా తొలి సెట్‌లో 4-1, రెండో సెట్‌లో 5-2తో ఆధిక్యంలోకి వెళ్లినప్పటికీ క్రెజ్‌సికోవా సత్తా చాటింది. చివరికి 2 గంటల 24 నిమిషాల్లో శాంసోనోవా విజయం సాధించడం గమనార్హం. శాంసోనోవా ప్రస్తుతం క్వార్టర్ ఫైనల్‌లో వెరోనికా కుడెర్మెటోవాతో తలపడనుంది.